Chief Election Commissioner Sunil Arora (Photo Credits: ANI)

New Delhi, Dec 21: దేశ వ్యాప్తంగా ఈ మధ్య జమిలి ఎన్నికల మీద ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీ నేతలు బహిరంగంగానే జమిలీ ఎన్నికలను జరపాలని చెబుతున్నారు. ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం జమిలీ ఎన్నికలపై (One Nation One Poll) సంచలన వ్యాఖ్యలు చేసింది. జమిలీ ఎన్నికలను నిర్వహించడానికి తాము సిద్ధంగానే ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా (CEC Sunil Arora) ప్రకటించారు.

'ఒకే దేశం.. ఒకే ఎలక్షన్‌' (One Nation, One Election) అనే నూతన పద్ధతిని అమలు చేయడానికి తాము సిద్ధమని ఆయన పేర్కొన్నారు. జమిలీ ఎన్నికలకు మేం సిద్ధమే. పార్లమెంట్‌ వీటిపై విస్తృతమైన సవరణలు చేసిన తర్వాత.. వన్‌ కంట్రీ-వన్‌ ఎలక్షన్‌ పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు మేం సిద్ధమే." అని సునీల్‌ అరోరా ప్రకటించారు.

ఇక అంతకు ముందుకు కూడా ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) జమిలీ ఎన్నికలపై స్పందించారు.రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా శాసన వ్యవహారాల ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సుకు మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో జమిలీ ఎన్నికలు అనే అంశం చర్చించే విషయం మాత్రమే కాదని, భారత్‌కు ఎంతో అవసరమని నొక్కి వక్కానించారు. కొన్ని నెలల వ్యవధిలోనే పదే పదే ఎన్నికలు నిర్వహించడం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయని పేర్కొన్నారు.

కరోనా తగ్గముఖం పడుతుందని తెలిపిన కేంద్రమంత్రి, దేశంలో తాజాగా 24,337 మందికి కోవిడ్ వైరస్, వచ్చే ఏడాది నుంచి టీకాల కార్యక్రమం, కోటీ యాభై లక్షలు దాటిన కరోనా కేసులు

అందుకే వాటిని ఒకేసారి నిర్వహించడంపై దృష్టి సారించాలని సూచించారు. వేర్వేరు చోట్ల కొన్ని నెలల వ్యవధిలోనే ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ధి పనులపై ప్రభావం చూపుతాయి. ఈ సమస్యపై లోతైన అధ్యయనంతో పాటు చర్చించాల్సిన ఆవశ్యకతా ఉందని ప్రధాని మోదీ సూచించారు.