Coronavirus in TS| (Photo Credits: PTI)

New Delhi, December 21: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 24,337 కొత్త పాజిటివ్‌ కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బారినపడిన వారి సంఖ్య 1,00,55,560కు చేరింది. ఆదివారం 333 మంది మృతి చెందగా ఇప్పటి వరకు 1,45,810 మంది ప్రాణాలు (Covid Deaths in India) కోల్పోయారు. ఈ మేరకు సోమవారం కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇక నిన్న 25,709 మంది డిశ్చార్జి అవ్వగా.. మొత్తం 96,06,111 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,03,639 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు 95.53గా ఉంది. మరణాల రేటు 1.45 శాతం ఉండగా.. యాక్టివ్‌ కేసుల శాతం 3.02కి తగ్గింది.

దేశంలో కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వచ్చే ఏడాది టీకా కార్యక్రమం చేపట్టాలని భావిస్తూ, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ మాట్లాడుతూ మిగిలిన దేశాలతో పోలిస్తే, మన దేశంలో కరోనా రికవరీ రేటు అత్యధికంగా ఉందన్నారు. ఇది 95 నుంచి 96 శాతం మధ్య ఉంది. అమెరికా, రష్యా, బ్రెజిల్ తదితర అభివృద్ధి చెందిన దేశాలలో రికవరీ రేటు 60 నుంచి 80 శాతం మధ్యన ఉందన్నారు. మన దేశంలో కరోనా డెత్ రేటు 4.45 శాతంగా ఉంది.

కరోనా మళ్లీ కొత్త రూపం దాల్చింది, లాక్‌డౌన్-4 దిశగా ప్రపంచ దేశాలు, మళ్లీ రాకపోకలపై నిషేధం, బ్రిట‌న్‌లో ప‌రిస్థితి చేయి దాటిపోయిందని తెలిపిన ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హాంకాక్

ఈ కరోనా చెడ్డకాలం త్వరలోనే ముగియనుంది. అయినా అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో జనవరి నుంచి కరోనా టీకాల కార్యక్రమం ప్రారంభం కానుంది. ముందుగా అత్యవసరమైన వారికి కరోనా టీకా ఇవ్వడం జరగుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో మూడు లక్షల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని అన్నారు. కరోనా కేసులు కోటికి చేరేనాటికి 95 లక్షల మంది వ్యాధి నుంచి విముక్తి పొందారన్నారు.