File image of EPFO office | (Photo Credits: PTI)

New Delhi, Feb 21: ఉద్యోగుల పెన్షన్‌ స్కీం (ఈపీఎస్‌) కింద అధిక పెన్షన్‌ అమలుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తాజా మార్గదర్శకాలతో ఉద్యోగి పదవీ విరమణ నాటికి ఉన్న వేతనంలో 8.33 శాతాన్ని పెన్షన్‌ రూపంలో చెల్లించేందుకు చేసిన సవరణ అమలు కానుంది. 2014 నాటి సవరణ ప్రకారం పెన్షన్‌ రూ.6,500 నుంచి రూ.15 వేల మధ్యలో పొందేందుకు అవకాశం కల్పించారు.

అయితే ఈ పెంపును వేతన పరిమితి ఆధారంగా నిర్ణయించేలా గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు లోబడి వర్తింపజేసేందుకు ఈపీఎఫ్‌ఓ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే సోమవారం ఈపీఎఫ్‌ఓ జోనల్‌ కార్యాలయాల్లోని అదనపు చీఫ్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్లు, ఈపీఎఫ్‌ఓ ప్రాంతీయ కార్యాలయాల్లోని రీజినల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్లకు సర్క్యూలర్‌ చేసింది. కొత్త గైడ్ లైన్ ప్రకారం..ఒక ఉద్యోగి, యజమాని కలిసి సైన్ అప్ చేయవచ్చు, అధిక నెలవారీ ప్రాథమిక జీతంలో 8.33 శాతం మినహాయించమని EPFOని అభ్యర్థించవచ్చు, తద్వారా వారి పని జీవితంలో పెన్షన్‌కు పెద్ద మొత్తంలో చేరడం జరుగుతుంది.

పాస్‌పోర్ట్ ఫ్రాడ్ అలర్ట్, ఈ ఫేక్ వెబ్‌సైట్ల జోలికి పోవద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ, అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే లాగిన్ కావాలని సూచన

EPFO ద్వారా నిర్వహించబడే EPS, ఉద్యోగులకు 58 ఏళ్ల తర్వాత పెన్షన్‌ను అందజేస్తుంది. ఉద్యోగి, యజమాని ఇద్దరూ ఉద్యోగి ప్రాథమిక జీతం, డియర్‌నెస్ అలవెన్స్‌లో 12 శాతం EPFకి జమ చేస్తారు. ఉద్యోగి యొక్క మొత్తం భాగం EPFకి వెళుతుంది, అయితే యజమాని అందించే 12 శాతం సహకారం EPFకి 3.67 శాతం, EPSకి 8.33 శాతం సహకారంగా విభజించబడింది.

ఈ పథకాల కింద సభ్యత్వంలో చేరిన తేదీ నుండి ఉద్యోగుల భవిష్య నిధి నుండి ఉద్యోగుల పెన్షన్ పథకానికి కార్పస్‌ను తిరిగి కేటాయించడం అవసరం. అధిక పెన్షన్ కోసం దరఖాస్తులను EPFOకి సమర్పించాలని EY-ఇండియా పీపుల్ అడ్వైజరీ సర్వీసెస్ భాగస్వామి పునీత్ గుప్తా అన్నారు.ఉద్యోగుల అవగాహనకు ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్లు ప్రకటనను నోటీసు బోర్డులో ఉంచాలని, అధిక పెన్షన్‌ కోసం సేవావిభాగాన్ని ఏర్పాటు చేయాలని ఈపీఎఫ్‌ఓ ఆదేశించింది.

ప్రెషర్స్‌కి విప్రో భారీ షాక్, సగం జీతానికే పనిచేయాలని మెయిల్, అందుకు ఓకే అంటే జాబ్‌లో చేరాలని తెలిపిన ఐటీ దిగ్గజం

ప్రతి జాయింట్‌ ఆప్షన్‌ అప్లికేషన్‌ను రిజిస్టర్‌ చేసి, డిజిటల్‌గా లాగ్‌ఇన్‌ చేసి, రసీదు సంఖ్యను ఉద్యోగికి అందించాలని సూచించింది. సీలింగ్‌ కన్నా ఎక్కువ వేతనమున్న ఉద్యోగులు అధిక పింఛన్‌ కోసం సమర్పించే దరఖాస్తును ప్రాంతీయ పీఎఫ్‌వో అధికారులు పరిశీలించి, నిర్ణయాన్ని పోస్టు ద్వారా, ఈమెయిల్, ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపాలి.

ఈపీఎస్‌ అధిక పెన్షన్‌కు అర్హులైన ఉద్యోగులంతా సంబంధిత ప్రాంతీయ కమిషనర్లకు దరఖాస్తు చేసుకోవాలి. జాయింట్‌ ఆప్షన్‌ దరఖాస్తు విధానం, వివరాలు, గడువు తేదీని సంబంధిత ఆర్‌పీఎఫ్‌సీ వెల్లడిస్తారు. అధిక పింఛనుకు ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చిన తరువాత ఉద్యోగుల భవిష్యనిధి నుంచి పింఛను నిధికి అవసరమైన నగదు సర్దుబాటు, అదనపు నిధి డిపాజిట్‌ విషయమై ఉమ్మడి ఆప్షన్‌ ఫారంలో ఉద్యోగి అంగీకారం కచి్చతంగా వెల్లడించాలి. అధిక పెన్షన్‌ అమలుపై యాజమాన్యాలకు అవగాహన కలి్పంచడం, సమస్యలను పరిష్కరించడం, సందేహాల నివృత్తిరి ఈపీఎఫ్‌వో కార్యాలయ అధికారులు అందుబాటులో ఉంటారు.