 
                                                                 New Delhi, Mar 21: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అరెస్ట్ చేయకుండా ఆదేశించలేమని చెప్పింది. ఈడీ అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. కాగా లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలంటూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
కేజ్రీవాల్ పిటిషన్‌పై ఈడీని వివరణ కోరింది. పిటిషన్‌పై విచారణను ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేసింది. మద్యం పాలసీ కేసులో (Delhi Excise Policy) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తొమ్మిది సార్లు ఢిల్లీ సీఎంకు సమన్లు జారీ చేసింది. తాజాగా గురువారం (మార్చి 21)న విచారణకు రావాలని నోటీసుల్లో కోరగా.. విచారణకు గైర్హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ లో విచారణకు సిద్ధం, ఈడీ తనపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటీషన్, విచారణకు హాజరయ్యేందుకు రెడీ అంటూ ప్రకటన
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ నిమిత్తం శుక్రవారం హాజరు కావాలంటూ ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే లిక్కర్ కేసులో ఇవాళ తనను ఈడీ కచ్చితంగా అరెస్ట్ చేస్తుందన్న అనుమానాల నేపథ్యంలో ఆయన ఈ ఉదయం ఢిల్లీ హైకోర్టులో హడావిడిగా మరో పిటిషన్ వేశారు. ఈడీ విచారణకు తాను సిద్ధమని, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని, ఈడీ తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ పిటిషన్‌లో అభ్యర్థించారు.
దీనిపై జస్టిస్‌లు సురేష్ కుమార్ కైత్, మనోజ్ జైన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ దశలో ఉపశమనం కల్పించే ప్రసక్తే లేదని తెలిపింది. మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేయకుండా ఈడీ నుంచి రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అయితే కేజ్రీవాల్ పిటిషన్‌పై ఈడీ కౌంటర్ దాఖలు చేసేందుకు అనుమతినిచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22న చేపట్టనున్నట్లు తెలిపింది.
కాగా లిక్కర్ కేసు వ్యవహారంలో ఈడీ ఇప్పటికే కేజ్రీవాల్‌కు తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేయగా.. సీఎం ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో సమన్ల ఉల్లంఘన కింద ఈడీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేయగా.. ఆయన బెయిల్ దక్కించుకున్నారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
