Representational Image | Couple (Photo Credits: Pixabay)

వదిన అంటే తల్లి లాంటిది. కానీ ఆమె మాత్రం కొడుకులాంటి మరిదిపై మోజు పడింది. ఆమె వయసు 35 సంవత్సరాలు, అతడి వయసు ఇంకా 27 సంవత్సారాలే. రోజూ అతడితో మాట్లాడేది.. అలా చనువు పెంచుకున్న ఆమె.. అతడిపై మోజు పెంచుకుంది. తనకు ఇద్దరు పిల్లలు.. చక్కగా చూసుకునే భర్త ఉన్నాడన్న సంగతి మరిచిపోయింది. నిత్యం అతడితో అర్థరాత్రి వరకు అతే పనిగా అతడితో చాటింగ్ చేసింది. ఇంట్లో ఏదో పని చేస్తున్నప్పుడు బిల్డప్ ఇస్తూ, పిల్లలను, భర్తను దూరం పెట్టేది. అర్థరాత్రి వరకు ఆమె ఫోన్లో బిజీగా ఉండడంతో మధ్య మధ్యలో ఆమె ఫోన్ తీసుకుని మెసేజ్ లు చెక్ చేస్తున్నా డిలీట్ చేసి ఉండేవి.. దీంతో భర్తకు అనుమానం రాలేదు. అయితే ప్రతి రోజూ అర్థరాత్రి వరకు నిద్రపోక పోవడం.. పిల్లలను తనను అస్సలు పట్టించుకోకపోవడంతో భర్తకు అనుమానం వచ్చి నిఘా పెడితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

 

తమ నేత హత్యకు ప్రతీకారం.. బెంగాల్‌లో ఐదు ఇళ్లకు బయట నుంచి తాళాలు వేసి నిప్పంటించిన దుండగులు, ఏడుగురు మంటల్లో సజీవదహనం

పోలీసులు, స్థానికులు చెప్పిన ప్రకారం.. పశ్చిమ బెంగాల్ పురూలియాకు చెందిన ఓ వివాహిత, రాజేష్ ఇద్దరూ వరుసకు వదిన, మరిది అవుతారు. దూరపు బంధువులు కావడంతో పెద్దగా పరిచయం ఉండేది కాదు. అయితే ఇటీవల ఇద్దరూ ఓ వివాహ వేడుకలో ద్వారా పరిచయం అయ్యారు. అలా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. అర్థరాత్రి వరకు అతడితోనే చాటింగ్ చేస్తూ ఉండేది. స్నేహితురాలి ఇంటికి అని చెప్పి నేరుగా రాజేష్ గదికి వెళ్ళి అతడితో శారీరక సంబంధం పెట్టుకుంది. దీంతో ఆమె ప్రవర్తనలో మార్పు గమనించిన భర్త.. పలుమార్లు ఆరా తీసినా ఏం లేదు.. తన బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్నాను అని చెప్పేది.. ఒకటి రెండు సార్లు ఆమె ఫోన్ చెక్ చేసినా మేసేజ్ లు డిలీట్ అయ్యి ఉండడంతో భర్తకు మొదట అనుమానం రాలేదు..

వ్యవహారం హద్దులు దాటింది. రాజేష్ తో కలిసి పట్టపగలే రాసలీలలు చేసేది. పిల్లలు, భర్తను అస్సలు దగ్గరకు రానివ్వకుండ ప్రవర్తన మారిపోయింది. అనుమానం వచ్చిన భర్త ఆమెపై నిఘా పెట్టాడు. స్నేహితురాలు, బంధువుల ఇంటికి అని చెప్పి రాజేష్ ఉంటున్న గదికి వెళుతోందని గమనించాడు. దీంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఇంట్లో వివాదం మొదలైంది. ఇద్దరి మధ్య అది పెద్ద గొడవకు దారి తీసింది. ఇదేం పని పిల్లలు ఉన్నారు కదా.. బుద్ధిగా ఉండాలి.. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని భర్త హెచ్చరించాడు.. భర్తతో జరిగిన గొడవను సైతం తన మరిది రాజేష్ కు చేరవేసింది.

ఈ క్రమంలో గతవారం రాజేష్ చెప్పినట్లు ఆ వివాహిత, ఒక లెటర్ రాసి బయటకు వెళ్ళింది. ఇద్దరు కలిసి స్థానిక రైల్వే స్టేషన్ కు పారిపోయి కోల్‌కతాకు వెళ్లిపోవాలని చూశారు. అయితే వివాహిత రాసిన లెటర్ లో తన భర్తతో జీవితం నచ్చక ఇల్లు విడిచి వెళ్లిపోతున్నాను అని పేర్కొంది. మహిళ భర్త ఏం చేయాలో తెలియక పోలీసులకు ఫిర్యాదు చేసాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ లోగా భర్త తరపు బంధువులు రాజేష్ ఎక్కడ ఉన్నాడో కనిబెట్టారు. రాజేష్ తో పాటు వివాహిత కూడా ఉందని నిర్ధారించుకున్నారు. కాగా తన భర్తతో తనకు విడాకులు కావాలంటూ వివాహిత గొడవ చేస్తోంది. వ్యవహారం న్యాయస్థానానికి చేరింది.