Delhi Chalo: ఢిల్లీ సరిహద్దుల్లో కదం తొక్కిన రైతులు, కొత్త వ్యవసాయ బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఉద్యమబాట, మద్దతు తెలిపిన కేజ్రీవాల్, పంజాబ్‌కు అన్ని సర్వీసులను రద్దు చేసిన హర్యానా ప్రభుత్వం
Farmers Protest (Photo Credits: ANI)

New Delhi, Nov 26: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో హై టెన్షన్‌ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ (Farmers' protest against new farm laws ) ఐదు రాష్ట్రాలకు చెందిన రైతులు చలో ఢిల్లీ (Delhi Chalo) ప్రకటించారు. ఈ నిరసన ప్రదర్శన అంబాలా- పాటియాలా ప్రాంతానికి చేరుకునే సరికి ఉద్రిక్తంగా మారిపోయింది. పోలీసులు ఏర్పర్చిన బారికేడ్లను రైతులు పక్కనే ఉన్న శంభూ నదిలోకి విసిరేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపు తప్పడంతో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనన్లను ప్రయోగించారు.

పంజాబ్‌ నుంచి వేలాది మంది రైతులు హర్యానా మీదుగా రాజధాని ( head towards Delhi) బాటపట్టారు. వారిని నిలువరించేందుకు హర్యానా సర్కార్‌ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దింపింది. బారికేడ్లు పెట్టి ఎక్కడిక్కడ రైతులను, కార్మిక సంఘాల నేతలను అడ్డుకుంటోంది. అంతేకాకుండా పంజాబ్‌, ఉత్తర ప్రదేశ్‌, రాజస్తాన్‌ హర్యానా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీకి బయలుదేరడంతో ఢిల్లీ ప్రభుత్వం (Delhi Govt) సైతం అప్రమత్తమైంది. రైతులపై జల ఫిరంగులు ప్రయోగిస్తూ ఎవరినీ కూడా నగరం లోపలకు అనుమతించకుండా అడ్డుకుంటున్నారు.

Here's ANI Tweets

రైతుల‌ప‌ట్ల‌ హ‌ర్యానా స‌ర్కారు వ్య‌వ‌హ‌రించిన తీరును పంజాబ్ ముఖ్య‌మంత్రి కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ (Punjab Chief Minister Captain Amarinder Singh) త‌ప్పుప‌ట్టారు. శాంతియుతంగా ఆందోళ‌న నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన రైతుల‌ను దౌర్జ‌న్యంగా అడ్డుకోవ‌డం దారుణం అన్నారు. రాజ్యాంగం దినోత్స‌వం నాడు కూడా ప్ర‌జ‌ల‌కు రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కుల‌ను కాల‌రాయ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. రైతుల‌వి దేశానికి అన్నం పెట్టే చేతుల‌ని, వారిని అడ్డుకోకుండా ఢిల్లీకి వెళ్ల‌నివ్వాల‌ని హ‌ర్యానా ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ క‌ట్ట‌ర్‌ను (Haryana Chief Minister Manoharlal Kattir) అమ‌రీంద‌ర్‌సింగ్‌‌ కోరారు. అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ (Akali Dal Chief Sukhbir Singh Badal) వరుస ట్వీ‍ట్స్‌తో నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల సంఘాలను కేంద్రం డిసెంబర్ 3 న రెండవ విడత చర్చలకు పిలిచింది.

Haryana police use water cannons on the protesting farmers 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేస్తున్న సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Delhi Chief Minister Arvind Kejriwal) శాంతియుత నిరసన చేయడం వారి రాజ్యాంగ హక్కు అంటూ ట్వీట్‌ చేశారు. కాగా లోక్‌సభ, రాజ్యసభల్లో కేంద్ర ప్రభుత్వ బిల్లులకు వ్యతిరేకంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓటు వేసింది.

Delhi CM Tweet

వ్యవసాయ రంగాన్ని సరళీకృతం చేసే చట్టాలకు నిరసనగా వేలాది మంది రైతులు పంజాబ్, హర్యానా నుంచి ఢిల్లీ వరకు కవాతులు నిర్వహిస్తున్నారు.ఇదిలా ఉంటే ఢిల్లీ పోలీసులు కోవిడ్‌ 19 నిబంధనలకు కట్టుబడి సమావేశాలకు వ్యతిరేకంగా నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా మెట్రో సౌకర్యాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.

వ్యవసాయ బిల్లులపై కేంద్రానికి నోటీసులు, నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించిన సుప్రీంకోర్టు, ఇప్పటికే ఆమోద ముద్ర పొందిన మూడు వ్యవసాయ బిల్లులు

ఇక రైతుల నిరసనల నేపథ్యంలో రెండు రోజుల పాటు పంజాబ్‌కు బస్సు సర్వీసులను హర్యానా ప్రభుత్వం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. హర్యానాలో బారీగేట్లను పెట్టి ట్రాఫిక్‌ను మళ్లించారు. పంజాబ్‌కు చెందిన వేలాది రైతులు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కవాతుగా గురువారం ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. వారంతా హర్యానా సరిహద్దు వద్ద సమావేశమయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానా ప్రభుత్వం తన భద్రతా సిబ్బందిని సరిహద్దుల దగ్గర మోహరించింది. కరోనావైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న తరుణంలో ఢిల్లీ ప్రభుత్వం నగరంలో ఎటువంటి ర్యాలీని అనుమతించడం లేదు. ఢిల్లీ సరిహద్దులైన గురుగ్రామ్, ఫరీదాబాద్ వద్ద కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర, నిరసనగా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన అకాలీదళ్, బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకం కావాలని సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ పిలుపు

భారీ సమావేశాలను అనుమతించకుండా, నిషేధ ఉత్తర్వులు రాష్ట్రంలో విధించారు. రెండు లక్షల మంది రైతులు హర్యానాకి చేరుకుంటారని భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా-ఉగ్రహాన్) పేర్కొంది. ఈ ర్యాలీకి అవసరమైన రేషన్, కూరగాయలు, కలప, ఇతర నిత్యావసర వస్తువులను రైతులు తీసుకొచ్చారు. చలి కాలం కావడంతో దుప్పట్లు కూడా వెంటతెచ్చుకున్నారు.

రైతుల నిరసన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం సైతం భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. సరిహద్దుల వద్ద బలగాలను మోహరించింది. ముఖ్యంగా ఘాజిపూర్ సరిహద్దు, చిల్లా సరిహద్దు, డిఎన్‌డిపై దృష్టి సారించింది. ఎనిమిది కంపెనీల పారామిలిటరీ దళాలు ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా ఢిల్లీ ప్రభుత్వం మెట్రో సర్వీసులను కుదించింది. పలు రైతు సంఘాల నుంచి వచ్చిన అభ్యర్థనలన్నీ తిరస్కరించామని, ఈ విషయాన్ని నిర్వాహకులకు తెలిపామని ఢిల్లీ పోలీసులు బుధవారం ట్వీట్ చేశారు.