FIR Lodged Against Sasikala: శశికళపై మరో కేసు నమోదు, బెదింరింపు కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదు చేసిన అన్నాడీఎంకే పార్టీ నేత సీ వీ ష‌ణ్ముగం, ఐపీసీలోని 506(1), 507, 109 సెక్ష‌న్లతో పాటు ఐటీ యాక్ట్‌లోని 67 సెక్ష‌న్ ప్ర‌కారం శశిక‌ళ‌పై కేసు న‌మోదు
V K Sasikala (Photo Credit: PTI/File)

Chennai, June 30: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత మహిళ నేత వి.కె శశికళపై మరో కేసు (FIR Lodged Against Sasikala) నమోదైంది. అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి CV షణ్ముగానికి శశికళ అనుచరులు నుంచి బెదిరింపులు వస్తున్నాయని తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని రోషనాయ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది..దీంతో ఆమె పైన పలు సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడు మాజీ మంత్రి షణ్ముగంను (Former AIADMK Minister) బెదిరించిన ఆరోపణలపై శశికళ తో పాటు 501 మంది మద్దతుదారులపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

అన్నాడీఎంకే పార్టీకి చెందిన నేత సీ వీ ష‌ణ్ముగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ కేసు బుక్ చేశారు. శ‌శిక‌ళ గురించి వ్య‌తిరేకంగా మాట్లాడిన త‌ర్వాత త‌న‌కు బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయ‌ని ష‌ణ్ముగం త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. గ‌తంలో త‌మిళ‌నాడు న్యాయ‌శాఖ మంత్రిగా చేసిన ష‌ణ్ముగం చేశారు. మీడియా ద్వారా శ‌శిక‌ళ‌పై కొన్ని కామెంట్స్ చేశాన‌ని, అయితే దానికి ఆమె బ‌దులు ఇవ్వ‌లేద‌ని, కానీ త‌న గుండాల చేత బెదిరిస్తోంద‌ని ష‌ణ్ముగం త‌న ఫిర్యాదులో చెప్పారు. ఈ నేప‌థ్యంలో శశిక‌ళ‌పై ఐపీసీలోని 506(1), 507, 109 సెక్ష‌న్లతో పాటు ఐటీ యాక్ట్‌లోని 67 సెక్ష‌న్ ప్ర‌కారం కేసు న‌మోదు చేశారు.

స్కూళ్లలో ఫీజులు తగ్గించమంటే చావమన్న ఎంపీ విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్‌, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో, చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

కొన్నేళ్ల క్రితం అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ.. ఇప్పుడు మళ్లీ పార్టీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. జైలు నుంచి వచ్చిన తరువాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏప్రిల్ 6న రాజకీయాలకు దూరంగా ఉంటానని శశికళ ప్రకటించింది. ఈ మధ్య తన మద్దతుదారులతో మాట్లాడిన ఫోన్ సంభాషణలు ఆడియో వెలుగులోకి వచ్చాయి. అందరం కలిసి ఐకమత్యంలో పనిచేద్దామని తాను చెప్పిన మాటలను పెడచెవిన పెట్టడం వల్లే అన్నాడీఎంకే ఓటమిపాలైందని శశికళ అన్నారు.