New Delhi, December 31: ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) నివాసం సమీపంలో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని(7 Lok Kalyan Marg) ప్రధాని నివాసం సమీపంలోని ఎస్పీజీ రిసెప్షన్( SPG reception area) ప్రాంతంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది… ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో 9 ఫైరింజన్లు(Nine fire tenders) సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
ముల్లును ముల్లుతోనే! పౌరసత్వ సవరణ చట్టంపై సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించిన బీజేపీ
ఈ ఘటన నేపథ్యంలో ప్రధాని నివాసానికి వెళ్లే రోడ్లన్నీ మూసేశారు. కాగా, అగ్ని ప్రమాదంపై స్పందించిన ప్రధాని కార్యాలయం.. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని పేర్కొంది. ఇప్పుడు మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయని పీఎంవో (PMO) ట్వీట్ చేసింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
నా దిష్టి బొమ్మలు కాల్చండి..అంతేకాని ప్రజల ఆస్తులను ధ్వంసం చేయకండి
See PMO India's Tweet
There was a minor fire at 9, Lok Kalyan Marg caused by a short circuit. This was not in PM’s residential or office area but in the SPG reception area of the LKM complex.
The fire is very much under control now.
— PMO India (@PMOIndia) December 30, 2019
ఎల్‌కేఎమ్ కాంప్లెక్స్‌కు దగ్గర్లోని ఎస్పీజీ రిసెప్షన్ ప్రాంతంలో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. రాత్రి 7.25 గంటల సమయంలో ఈ స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఇదిలా ఉంటే ప్రధాని నివాసానికి సమీపంలో ఇటువంటి ఘటన జరిగిన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు మోడీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Update by ANI
Delhi: Fire has been reported at Prime Minister's residence at 7, Lok Kalyan Marg around 7:25 pm today. Nine fire tenders have been rushed to the spot. As per sources, it is a minor fire. pic.twitter.com/wyerhwKAwv
— ANI (@ANI) December 30, 2019
ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు, జాతీయ ప్రముఖులు ఉండే ప్రాంతం లోక్ కళ్యాణ్ మార్గ్. గతంలో దీన్ని RCR అని పిలిచేవారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మార్గానికి లోక్ కళ్యాణ్ మార్గ్ అని పేరు మార్చారు.