Gwalior, May 18: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ పట్టణంలో సోమవారం ఉదయం జరిగిన ఒక అగ్నిప్రమాదంలో (Fire in Madhya Pradesh) ఏడుగురు సజీవదహనమయ్యారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గ్వాలియర్ పట్టణం రోషిణి ఘర్ రోడ్డులోని ఓ పెయింట్ దుకాణంలో ఉదయం ఒక్కసారిగా మంటలు (Gwalior Fire) లేచాయి. పెయింట్లు అంటుకొని మంటలు అన్నివైపులా విస్తరించడంతో పొరుగున ఉన్న ఇండ్లకు కూడా అగ్నికీలలు చుట్టుముట్టాయి. దాంతో నలుగురు చిన్నారులు సహా ఏడుగురు మంటలకు ఆహుతయ్యారు. ఫాస్టాగ్ లేకుంటే డబుల్ టోల్ ఫీజు, ఆదేశాలు జారీ చేసిన రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ, దేశవ్యాప్తంగా 1.68 కోట్ల ఫాస్టాగ్‌లను మంజూరు చేసిన ప్రభుత్వం
మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని గ్వాలియర్ అదనపు పోలీస్ సూపరింటెండెంట్ సత్యేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. అగ్నికి ఆహుతైన దుకాణం మృతులకు చెందినదే కావడం గమనార్హం. రెండు గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
భవనంలో నివసిస్తున్న 25 మందిని రక్షించడానికి 10 ఫైర్ టెండర్లను అక్కడికి తరలించారు. రంగ్వాలా హౌస్‌కు చెందిన హరియోమ్ గోయల్‌కు చెందిన ఈ ఆస్తి (Gwalior Building Blaze) గ్వాలియర్‌లోని రోష్ని ఘర్ రోడ్‌లో ఉంది. ఇదిలా ఉంటే ముంబైలోని మజ్గావ్ ఏరియాలోని నివాస భవనంలో మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ కౌశేంద్ర విక్రమ్ సింగ్, ఎస్పీ నవనీత్ భాసిన్ సంఘటన స్థలానికి చేరుకుని అగ్నిమాపక, సహాయక చర్యలను పర్యవేక్షించారు. "అగ్నిప్రమాదానికి కారణం ఇంకా నిర్ధారించబడలేదు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. 10 కి పైగా ఫైర్ టెండర్లు అక్కడికక్కడే ఉన్నాయి" అని ఎఎస్పి సత్యేంద్ర సింగ్ తోమర్ ANI కి చెప్పారు.