Florida, October 24: అమెరికాలోని ఫ్లోరిడాలో విషాదం చోటు చేసుకుంది. ఏఐ చాట్‌బాట్ కారణంగా ఓ టీనేజర్ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఆ టీనేజర్ తల్లి. Character.AI చాట్‌బాట్ తన కుమారుడిని ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహించిందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ, Character.AI మరియు Googleకి వ్యతిరేకంగా దావా వేసింది.
ఏప్రిల్ 2023లో, తన పుట్టినరోజుకు ముందు చాట్‌ని ఉపయోగించడం ప్రారంభించారు తొమ్మిదో తరగతి విద్యార్థి సెవెల్ సెట్జెర్. నెలరోజుల్లోనే ఆ బాలుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఎక్కువ సమయం ఒంటరిగానే గడిపేవాడని ఆమె తన వాజ్యంలో పేర్కొంది. చివరకు డిప్రెషన్‌లోకి వెళ్లగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే మానసిక సమస్యతో బాధపడుతున్నారని చెప్పారు. ఏఐ చాట్ బాట్‌తో చాట్ చేస్తూ తాను ప్రేమలో పడినట్లు భావించాడని చివరకు ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించింది.
యాప్ మేకర్స్, వ్యవస్థాపకులు ఉద్దేశపూర్వకంగా పిల్లల టార్గెట్ చేసేలా AI చాట్‌బాట్‌ను రూపొందించారని వెల్లడించారు. దీని వల్లే తన కుమారుడు ప్రాణాలు కొల్పోయారని...ఈ విషాదంతో తమ కుటుంబం నాశనమైందని దావాలో పేర్కొన్నారు. ఇది తన ఒక్క కుటుంబానికి జరిగిన నష్టం కాదని ఇంకా చాలా కుటుంబాలు బాధపడుతున్నాయని, వారందనికి అప్రమత్తం చేయడానికే ఈ దావా వేసినట్లు గార్సియా తెలిపారు.
చాట్‌బాట్ లైసెన్స్ పొందిన వ్యక్తి థెరపిస్ట్‌గా నటిస్తోందని, ఆత్మహత్య ఆలోచనలను ప్రోత్సహిస్తోందని, పిల్లలతో లైంగిక సంభాషణలలో పాల్గొనడం వంటి స్క్రీన్‌షాట్‌లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వీడియో ఇదిగో, కోచింగ్ సెంటర్ నుండి బయటకు వచ్చి తన్నుకున్న అమ్మాయిలు, వారిని రెచ్చగొడుతూ ఎంజాయ్ చేసిన అబ్బాయిలు
Character.aiని 2022లో ఇద్దరు మాజీ Google AI పరిశోధకులు నోమ్ షాజీర్ మరియు డేనియల్ డి ఫ్రీటాస్ స్థాపించారు. 20 మిలియన్ల పై బడిన సబ్ స్క్రైబర్లు ఈ యాప్‌కు ఉన్నారు. అయితే తన తన కొడుకు మరణానికి బాధ్యత వహిస్తూ క్యారెక్టర్.ఏఐపై అతని తల్లి దావా వేసింది.