Fake Jawan: ఇండియన్ ఆర్మీలో నకిలీ జవాన్‌, సెలెక్ట్ కాకపోయినప్పటికీ 4 నెలలు సరిహద్దులో విధులు, పఠాన్‌కోట్‌ ఆర్మీక్యాంపులో నకిలీ జవాన్‌ను గుర్తించిన అధికారులు, రూ. 8లక్షలు తీసుకొని ఆర్మీ డ్రస్, రైఫిల్ ఇచ్చిన మరో ఉద్యోగి
Indian-Army

Lucknow, NOV 24: నాలుగు నెలల పాటు ఆర్మీలో పని చేసిన నకిలీ జవాన్‌ (Fake Jawan) ఆ తర్వాత తాను మోసపోయినట్లు గ్రహించాడు. దేశ భద్రతను సవాల్‌ చేసిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో (Uttarapradesh) జరిగింది. ఘజియాబాద్ జిల్లాకు (Ghaziabad) చెందిన మనోజ్ కుమార్ ఆర్మీలో చేరాడు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ఆర్మీ క్యాంప్‌లో నాలుగు నెలలు విధులు నిర్వహించాడు. జీతం కూడా అందుకున్నాడు. తాను ఆర్మీ జవాన్‌ అని అతడు పూర్తిగా నమ్మాడు. అయితే అతడి నియామకం ఫేక్‌ అని తేలింది. దీంతో మనోజ్‌ కుమార్‌ను మోసగించిన ఆర్మీ జవాన్‌, మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా, 2019లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు హాజరైన మనోజ్‌ కుమార్‌ (Manoj kumar) సెలెక్ట్‌ కాలేదు. అయితే ఈ సందర్భంగా పరిచయమైన ముజఫర్‌నగర్‌కు చెందిన రాహుల్‌ సింగ్‌ ఆర్మీ జవాన్‌గా ఎంపికయ్యాడు. అనంతరం మనోజ్‌ కుమార్‌కు అతడు ఫోన్‌ చేశాడు. అతడికి ఆర్మీలో ఉద్యోగం వచ్చేందుకు సహకరిస్తానని చెప్పాడు. దీని కోసం రూ.8 లక్షలు వసూలు చేశాడు. ఈ ఏడాది జూలైలో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ () ఆర్మీ శిబిరానికి మనోజ్‌ కుమార్‌ను పిలిపించాడు. ఆర్మీ అధికారిగా నమ్మించిన వ్యక్తి అతడ్ని లోనికి తీసుకెళ్లాడు. వంటలో అతడి నైపుణ్యాన్ని పరీక్షించారు. భౌతిక పరీక్షలు కూడా నిర్వహించారు.

BJP MP Manoj Tiwari: 51 ఏళ్ళ వయసులో రెండో సారి తండ్రి కాబోతున్న ప్రముఖ నటుడు మ‌నోజ్ తివారీ, తన భార్యకు శ్రీమంతం నిర్వహించిన వీడియో షేర్ చేసిన బీజేపీ ఎంపీ 

ఈ నేపథ్యంలో మనోజ్‌ కుమార్‌ జూలై నుంచి నాలుగు నెలలపాటు పఠాన్‌కోట్‌ ఆర్మీ క్యాంప్‌లో విధులు నిర్వహించాడు. జీతం కూడా పొందాడు. సెంట్రీ డ్యూటీ సందర్భంగా రాహుల్‌ సింగ్‌ తన రైఫిల్‌ను అతడికి ఇచ్చాడు. దీంతో తనకు ఆర్మీలో ఉద్యోగం వచ్చిందని, తాను ఆర్మీ జవాన్‌ అని అతడు పూర్తిస్థాయిలో నమ్మాడు. తన నియామక పత్రాలు, ఐడీ కార్డును అక్కడున్న మిగతా జవాన్లకు చూపాడు. అయితే అవి నకిలీవని వారు చెప్పారు. అంతా సరిగానే ఉన్నదంటూ రాహుల్‌ సింగ్‌ నమ్మించాడు. అక్టోబర్‌లో మనోజ్‌ను అక్కడి నుంచి కాన్పూర్‌లోని ఫిజికల్‌ ట్రైనింగ్‌ అకాడమీకి పంపాడు. అనంతరం అతడ్ని అక్కడి నుంచి ఇంటికి పంపారు. మరోవైపు మనోజ్‌ కుమార్‌ నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్‌, ఐడీ కార్డును చూసిన ఆర్మీ జవాన్లు మిలిటరీ ఇంటెలిజెన్స్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో దీనిపై దర్యాప్తు చేపట్టారు. అయితే మనోజ్‌ కుమార్‌ను మోసగించిన జవాన్‌ రాహుల్‌ సింగ్‌ ఇటీవల అనారోగ్య కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కాగా, తనను ఇంటికి పంపేయడంపై మనోజ్‌, అతడి కుటుంబ సభ్యులు రాహుల్‌ సింగ్‌తో మాట్లాడారు. ఆర్మీలో ఉద్యోగం పేరుతో రూ.8 లక్షలు తీసుకుని మోసగించడంపై నిలదీశారు. దీంతో మనోజ్‌ తండ్రి బ్యాంకు ఖాతాలో కొంత డబ్బును రాహుల్‌ జమ చేశాడు. అయితే మొత్తం డబ్బులు తిరిగి ఇవ్వాలని మనోజ్‌ డిమాండ్‌ చేశాడు. దీంతో బిట్టు, రాజా సింగ్‌ అనే మరో ఇద్దరితో కలిసి రాహుల్‌ సింగ్‌ అతడిపై దాడి చేశాడు.

Rats 'Ate' 500 Kg Of Weed: 580 కేజీలకు పైగా గంజాయిని తిన్న ఎలుకలు, గోడౌన్‌లో దాచిన గంజాయిని ఎలుకలు మాయం చేశాయంటూ కోర్టుకు తెలిపిన మధుర పోలీసులు, ఇంతకీ ఏం జరిగిందంటే? 

కాగా, ఆర్మీ ఇంటెలిజెన్స్‌ ఫిర్యాదుతో రాహుల్‌ సింగ్‌, ఆర్మీ అధికారిగా నమ్మించిన బిట్టూను మీరట్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి రాజా సింగ్‌ కోసం వెతుకుతున్నారు. మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, దాడి వంటి ఆరోపణలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మనోజ్ కుమార్ నాలుగు నెలలు విధులు నిర్వహించిన పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ఆర్మీ క్యాంప్‌లోని బెటాలియన్ దేశ సరిహద్దులకు వెళ్లే ఆర్మీ యూనిట్ల భద్రతను పర్యవేక్షిస్తుంది. అలాంటి కీలక ఆర్మీ క్యాంప్‌లో నకిలీ రిక్రూట్‌మెంట్‌ ద్వారా అతడు నాలుగు నెలలపాటు పని చేయడం దేశ భద్రతపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నది.