Bangalore, FEB 12: టాలీవుడ్ నటుడు, టీడీపీ లీడర్ తారకరత్న (Taraka Ratna) ఇటీవల గుండెపోటు కారణంగా కుప్పకూలి పోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను కుప్పం (Kuppam) ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ఇక గతకొద్ది రోజులుగా వైద్యులు ఆయనకు చికిత్సనందిస్తూ తెగ శ్రమిస్తున్నారు. కాగా, తాజాగా తారకరత్నకు (Taraka Ratna Health) మరింత మెరుగైన చికిత్సను అందించేందుకు ఫారిన్ డాక్టర్లను తీసుకొచ్చింది నారాయణ హృదయాలయ ఆసుపత్రి. గుండె సహా మెదడుకు సంబంధించి స్పెషల్ ట్రీట్మెంట్ ను ఈ వైద్యులు అందిస్తున్నారు. నిరంతరం వారి పర్యవేక్షణలోనే తారకరత్న చికిత్స జరుగుతున్నట్లుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
Unstoppable-2: బాలయ్యతో పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్..?? 'అన్ స్టాపబుల్ 2' వేదికగా చర్చ.. ఏంటా విషయం??
తారకరత్న ప్రస్తుతం కోమాలోనే ఉన్నాడని. త్వరలోనే ఆయన కోలుకుంటారని వైద్యులు ఆశిస్తున్నారు. ఇక నందమూరి కుటుంబ సభ్యులు నిత్యం తారకరత్న ఆరోగ్యం గురించి దగ్గరుండి ఆరా తీస్తున్నారు. అటు బాలకృష్ణ కూడా బెంగుళూరులోనే ఉంటూ తారకరత్న ఆరోగ్యం పై నిత్యం ఆరా తీస్తున్నారు. వీలైనంత త్వరగా తారకరత్న కోలుకోవాలని నందమూరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.