Rajasthan: బతకాలని లేదు, పెద్ద కొడుకు దగ్గరకే వెళతున్నాం, ఉరివేసుకుని నలుగురు ఆత్మహత్య, రాజస్థాన్‌ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ కుటుంబంలో విషాదం
Fearing he has coronavirus infection, AP man kills self (Representative (Image: PTI)

Jaipur, Feb 22: రాజస్థాన్‌ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మదన్ లాల్ కొడుకు వరుస అయిన హనుమాన్ ప్రసాద్‌తో సహా నలుగురు ఈ బలవన్మరణానికి పాల్పడ్డారు. హనుమాన్ ప్రసాద్ స్వయాన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీకి (Former BJP State President's Family) సోదరుని కుమారుడు అని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇటీవల తమ కుటుంబ సభ్యుడ్ని కోల్పోయిన బాధతోనే బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం. మృతులను హనుమాన్ ప్రసాద్ సైనీ, మదన్‌లాల్‌ భార్య తారా, ఇద్దరు కుమార్తెలు అంజు, పూజలుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే సీకర్ జిల్లా ఉద్యోగ్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

10వ తరగతి పరీక్ష రాస్తూ హాల్లోనే చనిపోయిన విద్యార్థి, అధిక జ్వరం ఉన్నందున వద్దని వారించిన తల్లి, ఏడాది వేస్ట్ అవుతుందని పరీక్ష రాసిన రోహిత్, బీహార్‌లో విషాద ఘటన

హనుమాన్ ప్రసాద్ పెద్ద కుమారుడు 2020 సెప్టెంబరులో మృతి చెందాడు. హనుమాన్ ప్రసాద్ రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ పెద్ద కుమారుడు మృతి చెందిన తరువాత మిగిలిన వారికి బతకాలనే ఆశ లేదని నోట్ పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారి వీరేంద్ర శర్మ తెలిపారు.