Fuel Price Hike: చల్లారని పెట్రో మంటలు, తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంపు, గత 15 రోజుల్లో ధరలు పెరగడం ఇది 13వ సారి.
Petrol Price In India | Representational Image | (Photo Credits: PTI)

దేశంలో వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్‌ పంపులకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. గత రెండువారాలుగా ధరలను పెంచుతూ (Fuel Price Hike) వస్తున్న చమురు కంపెనీలు.. తాజాగా మంగళవారం లీటర్‌ పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.104.61, డీజిల్‌ రూ.95.87కు చేరింది. ముంబైలో పెట్రోల్‌ రూ.119.67, డీజిల్‌ రూ.103.92కి చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.118.59, డీజిల్‌ రూ.104.62కి పెరిగింది. దేశంలో గడిచిన 24 గంటల్లో కేవలం 795 కేసులు, కొత్తగా 1,280 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి

గత మార్చి 22 తర్వాత ఒకటి రెండు రోజులు మినగా వరుసగా ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గత 15 రోజుల్లో ధరలు పెరగడం ఇది 13వ సారి. ఇప్పటి వరకు లీటర్‌ పెట్రోల్, డీజిల్‌పై దాదాపు రూ.11 వరకు పెరిగింది. భారీగా ఇంధన ధరల పెరుగుతుండడంతో సామాన్యులు పెట్రోల్‌ బంకులకు వెళ్లాలంటే వణికిపోతున్నారు. ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 3.12 డాలర్లు పెరిగి బ్యారెల్‌కు 107.52 డాలర్లకు చేరుకుంది. అదేవిధంగా డబ్ల్యూటీఐ క్రూడ్ కూడా బ్యారెల్‌కు 4.03 డాలర్లు పెరిగి 103.30 డాలర్లకు చేరింది.