G kishan-reddy-comments-on-prashant-who-is-in-pakistan-jail (Photo-ANI)

Hyderabad, November 24: తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించారంటూ ప్రశాంత్ (Prashanth) అనే తెలుగు యువకుడ్ని పాకిస్థాన్(Pakistan) భద్రతా బలగాలు అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి (G Kishan Reddy) స్పందించారు. ప్రశాంత్ ను భారత్ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, పాకిస్థాన్ లోని భారత దౌత్య కార్యాలయం(Indian embassy in Pakistan)తో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు.

ఎంత కష్టమైనా ప్రశాంత్‌ను భారత్ (India) కు తీసుకువస్తామని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే ప్రేమ వ్యవహారంలో దెబ్బతిన్న ప్రశాంత్ మానసిక వ్యాకులతకు లోనై పాకిస్థాన్ లో ప్రవేశించి ఉంటాడని భావిస్తున్నారు.

ANI Tweet

కాగా ఇద్దరు భారతీయ యువకులు పాకిస్తాన్ పోలీసుల చెరలో ఉన్నారు. విశాఖకు చెందిన ప్రశాంత్, మధ్యప్రదేశ్‌కు చెందిన వారీలాల్ బాహవల్‌పూర్ జైల్లో మగ్గుతున్నారు. వారి కోసం కుటుంబ సభ్యులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అక్కడ తమవారి పరిస్థితిని తలచుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. త్వరగా తీసుకురావాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.

ప్రశాంత్ తండ్రి

ఇదిలా ఉంటే మమ్మీ, డాడీ బావున్నారా.. నన్ను ఇక్కడ కోర్టుకు తీసుకొచ్చారు’ అంటూ అతడు మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. హైదరాబాద్‌కు చెందిన ఈ యువకుడు పాక్ చెరలో ఉన్నట్లు తెలియడంతో దేశం ఉలిక్కిపడింది. ప్రశాంత్‌తో పాటు మరో భారతీయుడిని కూడా అరెస్టు చేసినట్లు పాక్ పోలీసులు చెబుతున్నారు.

భారత్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అక్రమంగా పాకిస్థాన్‌లోకి చొరబడ్డాడని.. ఆధునిక సాంకేతికతతో అక్కడ పెద్ద ఎత్తున పేలుళ్లు జరపడానికి కుట్ర జరిగిందని పాక్ పత్రికల్లో కొన్ని కథనాలు కూడా వచ్చినట్లు తెలియడం కలవర పాటుకు గురి చేసింది.

ప్రశాంత్ కు మతిస్థిమితం కూడా సరిగా లేదని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతడు రెండున్నరేళ్ల కిందటే ఇంటి నుంచి వెళ్లిపోయాడని తండ్రి తెలిపారు. మాదాపూర్‌లో ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ప్రశాంత్ 2017 ఏప్రిల్ 28న ఆఫీస్‌కు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని అంటున్నారు. ఆ మరుసటి రోజే  పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ కుమారుడు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశానని అతడి తండ్రి బాబు రావు చెబుతున్నారు.