Gautam Adani: ఆసియాలో అత్యంత ధనవంతుడిగా గౌతం అదాని, ప్రపంచ కుబేరుల్లో బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టి నాలుగో స్థానం,10వ స్థానంలో ముఖేశ్‌ అంబానీ
Gautam Adani, Bill Gates (Credits: Instagram)

గత రెండు సంవత్సరాలుగా భారత వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ (Gautam Adani) కంపెనీ భారీ లాభాలతో దూసుకుపోతోంది. తాజాగా ప్రపంచ కుబేరుల్లో గౌతమ్‌ అదానీ తన స్థానాన్ని ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకున్నారు. అయితే ఈ ఏడాదిలోనే రికార్డు స్థాయిలో ఆయన ఆస్తుల విలువ పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఫోర్స్బ్‌ ప్రకటించిన సంపన్నుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టి అదానీ నాలుగో స్థానానికి (Gautam Adani Grabs 4th Spot ) దూసుకెళ్లారు.

ఇటీవల బిల్‌ గేట్స్‌ 20 బిలియన్‌ డాలర్లను (Donates $20 Billion) గేట్స్‌ ఫౌండేషన్‌కు విరాళమిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం అనంతరం గేట్స్‌ ఒక స్థానం కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో అదాని 114 బిలియన్‌ డాలర్ల సంపదతో నాలుగో స్థానానికి ఎగబాకారు.

టెల్కో ప్రత్యర్థులకు షాక్, టెలికం రంగంలోకి అదాని గ్రూపు, 5జీ స్పెక్ట్రం వేలంలో రూ. 100 కోట్లు డిపాజిట్‌

ప్రపంచవ్యాప్తంగా ధనవంతుల విషయానికొస్తే.. అత్యధిక సంపాదన 230 బిలియన్ డాలర్లతో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో నిలవగా, రెండు, మూడు స్థానాల్లో బెర్నార్డ్ ఆర్నాల్డ్, అమెజాన్ అధినేత జెప్ బెజోస్ లు నిలిచారు. నాలుగో స్థానంలో గౌతమ్ అదాని నిలిచారు. రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ మాత్రం పదో స్థానంలో కొనసాగుతున్నారు.