Lucknow, Feb 2: ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ జిల్లాలో పోలీసులు తన కూతురును వెతికేందుకు ఓ మహిళ దగ్గర లంచం డిమాండ్ చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గత నెలలో కిడ్నాప్ అయిన తన కూతురుని వెతకాలంటే జీపుకి డీజిల్ అవసరమని .. కాబట్టి మీ కూతురును వెతకాలంటే వాహనాల్లో డీజిల్ నింపడానికి (Give Diesel, Will Search) రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు చెల్లించాలని పోలీసులు (Kanpur police) డిమాండ్ చేశారని ఆ మహిళ ఆరోపించింది.
దీంతో చేసేదేమి లేక ఆ మహిళ ( differently abled Woman) ఆ మొత్తం చెల్లించిందని అయినప్పటికీ ఫిర్యాదును మాత్రం పోలీసులు పట్టించుకోలేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఇదేంటని ప్రశ్నిస్తే.. కుమార్తె క్యారెక్టర్ గురించి అసభ్యంగా మాట్లాడారని ఆ తల్లి ఉన్నతాధికారులకు చేసిన ఫిర్యాదులో తెలిపింది.
గుడియా అనే మహిళ సోమవారం కాన్పూర్ పోలీసు ఉన్నతాధికారిని ఈ కేసు విషయమై సంప్రదించింది. కొద్దిపాటి భూమిని కలిగి ఉన్న వితంతువు అయిన ఎంఎస్ గుడియా గత నెలలో తప్పిపోయిన తన కుమార్తె గురించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అయితే పోలీసులు ఆమెకు సహాయం చేయలేదని అమె ఆరోపించారు. పోలీసులు 'మేము చూస్తున్నాం' అని ఆమెకు చెప్పారు. కొన్నిసార్లు వారు నన్ను దూరంగా పొమ్మని చెబుతారు, నీ కుమార్తె ఎవరితో వెళ్లిందో అని తప్పుగా మాట్లాడుతారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసిందని అక్కడి మీడియా తెలిపింది.
"కొన్నిసార్లు వారు 'చల్ యాహన్ సే' ("ఇక్కడి నుంచి వెళ్లండి) అని చెప్తారు. నేను వారి వాహనాల్లో డీజిల్ నింపాను. నేను 3-4 ట్రిప్పులకు చెల్లించాను.డీజిల్ కోసం డబ్బును ఏర్పాటు చేయడానికి బంధువుల నుండి రుణాలు తీసుకున్నట్లు ఆమె మీడియాకు చెప్పారు. "నేను 10,000-15,000 రూపాయలు విలువైన డీజిల్ ఏర్పాటు చేశానని పోలీసు చీఫ్తో చెప్పాను. నేను ఇలా ఎలా ముందుకు వెళ్ళగలనని ఆమె మీడియాతో అన్నారు.
Here's Kanpur Nagar Police Tweet
प्रकरण में थाना चकेरी पर अभियोग पंजीकृत है लड़की की बरामदगी हेतु CO CANTT के निर्देशन में 04 टीमे गठित की गयी, पीड़ित महिला को पुलिस स्कार्ट कार से थाना भिजवाया गया तथा #DIG/SSP-KNR द्वारा चौकी इंचार्ज सनिगवां उ0नि0 राजपाल सिंह को लाइन हाजिर कर विभागीय जांच के आदेश दिये गये। pic.twitter.com/8LduYjgASB
— Kanpur Nagar Police (@kanpurnagarpol) February 1, 2021
గుడియా తన ఆవేదనను వివరించే వీడియో క్లిప్‌లు వైరల్ అయిన తరువాత, కాన్పూర్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. కమిషనర్ కార్యాలయం నుండి సంబంధిత పోలీస్ స్టేషన్ వరకు వృద్ధ మహిళను పోలీసు వాహనంలో నడుపుతున్న వీడియోను పోలీసు శాఖ ట్వీట్ చేసింది. తన కుమార్తెను వెతికేందుకు నాలుగు టీంలు ఏర్పడ్డాయని ట్వీట్‌లో పేర్కొన్నారు.
"ఈ కేసుపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జిని కోరాము. ఆమె ఆరోపణలన్నీ పరిశీలించబడతాయి మరియు ఎవరైనా దోషిగా తేలితే మేము చర్యలు తీసుకుంటాము" అని కాన్పూర్‌లోని సీనియర్ పోలీసు అధికారి బ్రజేష్ కుమార్ శ్రీవాస్తవ మీడియాతో అన్నారు.