Goa Urban Development Minister Milind Naik (Pic credit: Government of Goa)

Panaji, December 16: లైంగిక వేధింపుల ఆరోపణలతో గోవా మంత్రి మిలింద్ నాయక్ తన మంత్రిపదవికి రాజీనామా (Goa Minister Milind Naik Resigns) చేశారు.ఈ మేర గోవా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) బుధవారం అర్థరాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. నిస్పక్షపాతంగా న్యాయ విచారణ జరిగేలా చూసేందుకు మంత్రి నాయక్ (Goa Minister Milind Naik) రాజీనామాను సమర్పించినట్లు సీఎంఓ పేర్కొంది.నాయక్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారని, దానిని ఆమోదించి గవర్నర్‌కు పంపినట్లు సీఎంఓ ట్వీట్‌లో పేర్కొంది.

ఈ దెబ్బతో గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాగా మిలింద్ నాయక్‌కు లైంగిక వేధింపుల కేసులో ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఆరోపించడంతో మంత్రివర్గం నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. గోవా అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి అయిన బీజేపీ శాసనసభ్యుడు మిలింద్ నాయక్‌ ఒక మహిళను లైంగికంగా వేధించాడని కాంగ్రెస్ గోవా చీఫ్ గిరీష్ చోడంకర్ ఆరోపించారు. సీఎం సావంత్ మంత్రిని బర్తరఫ్ చేయాలని, ఆయనపై వచ్చిన ఆరోపణలపై పోలీసు విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

దక్షిణ గోవాలోని మోర్ముగావ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం మిలింద్ నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోద్ సావంత్ నేతృత్వంలోని మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి శాఖను (state Urban Development minister) నిర్వహించారు. అప్పటి ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ నేతృత్వంలోని గత మంత్రివర్గంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు.

అమ్మాయిల కనీస పెళ్లి వయస్సు 21 ఏళ్లు, యువతుల కనీస వివాహ వయసు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్

గత నెల చివరి వారంలో ఒ మహిళను మంత్రి మిలింద్ నాయక్ మానసికంగా, శారీరకంగా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చోడంకర్ ఆరోపించారు. అయితే ఆ సమయంలో మంత్రి పేరు బయట పెట్టేందుకు మహిళ విముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో.. చోడంకర్ తప్పనిసరి పరిస్థితుల్లో నాయక్ పేరును బయట పెట్టారు. దీంతో గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు సంకల్ప్ అమోన్కర్ కూడా మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు – మంత్రికి మధ్య జరిగిన ఉద్దేశపూర్వక ఆడియో సంభాషణను కూడా అమోంకర్ మీడియా సమావేశంలో విడుదల చేశారు. దీంతో ముఖ్యమంంత్రి సావంత్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు న్యాయబద్ధంగా జరిగేందుకు మంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు మిలింద్ నాయక్ వెల్లడించారు.