Marriage| Representational Image (Photo Credits: unsplash)

New Delhi, December 16: కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రస్తుతం ఉన్న యువతుల కనీస వివాహ వయసు 18 ఏళ్లు.. ఇక నుంచి 21 ఏళ్లు పెంచుతూ నిర్ణయం (Legal Age for Women to Marry) తీసుకుంది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో యువతుల కనీస వివాహ వయసు ప్రతిపాదనకు ఆమోదం ( Union Cabinet Clears Proposal) లభించింది. ఈ ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సస్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా యువతుల వివాహ వయసు పెంచుతామని తన ప్రసంగంలో పేర్కొన్న విషయం తెలిసిందే.

తమ ప్రభుత్వం కుమార్తెలు, సోదరీమణుల ఆరోగ్యం గురించి నిరంతరం శ్రద్ధ వహిస్తుందని తెలిపారు. అదే విధంగా పోషకాహార లోపం నుంచి వారిని రక్షించాలని, అందులో భాగం‍గానే వారికి సరైన వయసులో వివాహం చేయటం అవసరని పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అబ్బాయిల వివాహ కనీస వయసు 21 ఏళ్లు, అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. అయితే బాల్య వివాహాల నిషేధ చట్టం, ప్రత్యేక వివాహాల చట్టం, హిందూ వివాహాల చట్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.

చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ క‌మిటీ చైర్మెన్‌గా ఎంఎం న‌ర‌వణె, త్రివిధ దళాధిపతులలో అత్యంత సీనియర్‌ మనోజ్ ముకుంద్ నరవణే కావడంతో కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగింత

జయ జైట్లీ (Jaya Jaitly) నేతృత్వంలోని నీతి ఆయోగ్ టాస్క్‌ఫోర్స్ అమ్మాయిల కనీస వివాహ వయసు ప్రతిపాదనకు మద్దతు ఇచ్చింది. స్త్రీలకు మొదటి గర్భధారణ సమయంలో కనీసం 21 ఏళ్లు ఉండాలని టాస్క్‌ఫోర్స్ చెప్పడంతో ఈ ప్రతిపాదనపై డిసెంబర్‌ నెలలోనే సిఫారస్సులు సమర్పించారు.