Newdelhi, Nov 11: విమానాశ్రయాల్లో (Airports) ఏర్పాటు చేసే ఫుడ్ కోర్టుల్లో ఆహార పదార్థాలు (Food Prices) చాలా ఎక్కువ ధరకు విక్రయిస్తారు. ఎయిర్ పోర్టులలో భోజనం చేయడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సామాన్యులైతే ధరలు చూసి కడుపు మాడ్చుకుంటారు కానీ కొనడానికి మొగ్గుచూపరు. అయితే సామాన్యుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సరసమైన ధరలకే ఆహారం, పానీయాలను విక్రయించేందుకుగానూ ‘ఎకానమీ జోన్’లను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎకానమీ జోన్ లు ఆచరణలోకి వస్తే ఎయిర్ పోర్టుల్లో సామాన్య ప్రయాణికులు కూడా ఆకలి తీర్చుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
हवाई अड्डों पर बनेगा इकोनामिक जोन, सस्ते दामों में मिलेगा खाने-पीने का सामान #Airport | #FoodRates | @PallavMishra11 pic.twitter.com/m45ybS6wiz
— NDTV India (@ndtvindia) November 11, 2024
కూర్చోవడానికి ఉండదు..
ఎయిర్ పోర్టులో ఇతర రెస్టారెంట్ల మాదిరిగా కాకుండా, ఈ ఎకానమీ జోన్ లలో... కూర్చొని తినే ఏర్పాట్లు ఉండవని అధికారులు చెబుతున్నారు. ప్రయాణీకులు ఫాస్ట్ ఫుడ్ టేబుల్స్ వద్ద తినాల్సి ఉంటుంది, లేదంటే ఆహారాన్ని తమ వెంట తీసుకెళ్లే సౌలభ్యం ఉంటుంది. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ లో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సోషల్ మీడియా ఒక పోస్ట్ పెట్టారు. కోల్ కతా విమానాశ్రయంలోని ఓ ఫేమస్ దుకాణంలో ఒక కప్పు టీ రూ. 340 ఖర్చవుతోందని ఆయన వాపోయారు. ఈ పోస్ట్ అప్పట్లో సంచలనం సృష్టించింది.