New Delhi, Nov 3: దీపావళి సందర్భంగా పెట్రో ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్ తెలిపింది.పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు (Petrol, Diesel Price Reduction) బుధవారం ప్రకటించింది.పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ తగ్గింపు ధరలు ( Reducing Central Excise Duty on Petrol) రేపటినుంచి అమల్లోకి రానున్నాయి.
మరింత ఉపశమనం కలిగించేందుకు రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని సూచించింది. ఇటీవల పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.110.04గా ఉండగా, డీజిల్ లీటర్ రూ.98.42, ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.115.85, డీజిల్ రూ.106.62 ధర పలికింది. కేంద్రం తాజా నిర్ణయంతో వాహనదారులకు కాస్త ఊరట కలుగనున్నది.
తాజా నిర్ణయంతో పెట్రోల్, డీజెల్ ధరలు తగ్గనున్నాయి. డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు పెట్రోల్ కంటే రెట్టింపుగా ఉండటంతో రాబోయే రబీ సీజన్ లో రైతులకు కొంత ప్రయోజనకరంగా ఉండనుందని పేర్కొంది. రాష్ట్రాలు కూడా వ్యాట్ ను తగ్గిస్తే వినియోగదారులకు మరింతగా ఊరట ఉంటుందని కేంద్రం (Govt of India ) కోరినట్లు సమాచారం.
Here's ANI Update
On eve of #Diwali, Government of India announces excise duty reduction on petrol and diesel. Excise duty on Petrol and Diesel to be reduced by Rs 5 and Rs 10 respectively from tomorrow pic.twitter.com/peYP1fA4gO
— ANI (@ANI) November 3, 2021
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.04 కాగా, డీజిల్ ధర రూ.98.42గా ఉంది. ముంబైలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.115.85 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.106.62గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.66గా ఉంది. బుధవారం లీటర్ డీజిల్ ధర రూ.102.59గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.49 కాగా, డీజిల్ ధర రూ.101.56.
వరుసగా ఏడో రోజు మంగళవారం కూడా ఇంధన ధరలు పెరిగాయి. ఢిల్లీలో డీజిల్ ధరలు లీటరుకు రూ.9.90 చొప్పున గత 39 రోజుల్లో 30 రోజులు పెరిగాయి. డీజిల్ ధర భారీగా పెరగడంతో, దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇంధనం ఇప్పుడు లీటరు రూ. 100కు పైగా అందుబాటులో ఉంది. సోమవారం నాడు లీటరు రూ. 98.42కి చేరిన ఢిల్లీలో కూడా ఈ మార్కును క్రాస్ చేయడానికి చాలా దగ్గరగా ఉంది.
సెప్టెంబరు 5 నుండి పెట్రోల్ ధరలు స్థిరత్వాన్ని కొనసాగించాయి, అయితే చమురు కంపెనీలు చివరకు గత వారం పంపు ధరలను పెంచాయి. ఈ వారంలో ఉత్పత్తి ధరలను పెంచాయి. పెట్రోల్ ధరలు కూడా గత 35 రోజులలో 28 రోజులు పాటు పెరిగాయి, దాని పంపు ధర లీటరుకు రూ. 8.85 పెరిగింది.