Finance Nirmala Sitharaman

New Delhi, Feb 20: బెల్లం పాకం, పెన్సిల్‌ షార్పనర్లు సహా కొన్ని ఉత్పత్తులపై జీఎస్టీ కౌన్సిల్‌ పన్ను రేట్లను తగ్గించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Finance Minister Nirmala Sitharaman) అధ్యక్షతన శనివారం ఢిల్లీలో జరిగిన 49వ జీఎస్టీ మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. బెల్లం పాకం జీఎస్టీని 18 శాతం నుంచి తగ్గించాలని (GST Council Reduced Tax on Liquid Jaggery ) జీఎస్టీ కమిటీ నిర్ణయించిందని, దానిని లూజుగా విక్రయిస్తే జీరో సుంకం ఉంటుందని, ప్యాకింగ్‌తో లేబుల్‌తో విక్రయిస్తే 5 శాతం పన్ను వర్తిస్తుందని వివరించారు. పెన్సిల్‌ షార్పనర్లపై (Pencil Sharpeners) సుంకం 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గుతుందని ఆర్థిక మంత్రి అన్నారు.

సీబీఐని కేంద్రం నియంత్రిస్తుంది, అలాంటప్పుడు ఈ కేసును ఎలా అప్పగిస్తారు, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది దవే వాదనలు, కేసు విచారణ ఈనెల 27కి వాయిదా

ఇప్పటికే కంటైనర్‌కు ఫిక్స్‌ చేసి ఉన్న ట్యాగ్‌ ట్రాకింగ్‌ డివైజ్‌ లేదా డేటా లాగర్‌ పై విడిగా ఐజీఎస్టీ విధించకూడదని మండలి నిర్ణయం తీసుకుంది. వ్యాపారస్తులకు వార్షిక రిటర్నుల ఫైలింగ్‌ ఆలస్యమైతే, రోజుకు రూ.50 (టర్నోవర్‌లో 0.04 శాతానికి మించకుండా) రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రూ.5 కోట్ల నుంచి రూ.20 కోట్ల టర్నోవర్‌ కలిగిన వారు రోజుకు రూ.100 (టర్నోవర్‌లో 0.04 శాతానికి మించకుండా) చెల్లించాలి. ప్రస్తుతం ఆలస్య రుసుము రోజుకు రూ.200 (గరిష్ఠంగా టర్నోవర్‌లో 0.5 శాతం)గా ఉంది.పాన్‌ మసాలా, గుట్కా సంస్థలపై సామర్థ్య ఆధారిత పన్ను విధించాలని జీఓఎం ప్రతిపాదించింది. అప్పిల్లేట్‌ ట్రైబ్యునళ్ల ఏర్పాటుకు సంబంధించిన నివేదికను కొన్ని సవరణలతో అంగీకరించింది.ఈ సమావేశంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌పై పన్ను ఆంశం మాత్రం చర్చకు రాలేదు.

అరుణాచల్ APPSC పేపర్ లీక్ కేసు, భద్రతా సిబ్బంది, నిరసనకారుల మధ్య ఘర్షణ, అర్ధరాత్రి నుండి CrPC సెక్షన్ 144 అమల్లోకి

గత ఏడాది జూన్‌ నెలకుగాను రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్‌టీ పరిహారంలో 50 శాతాన్ని ఇప్పటికే చెల్లించిన కేంద్రం.. పెండింగ్‌లో ఉన్న మిగతా 50 శాతం (రూ.16,982 కోట్లు) బకాయిలను కూడా పరిష్కరిస్తున్నట్లు ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రకటించారు. ప్రస్తుతం జీఎస్టీ పరిహార నిధిలో అంత సొమ్ము లేకపోయినప్పటికీ, కేంద్రం తన సొంత వనరుల నుంచి నిధులను విడుదల చేయనుందని, ఈ మొత్తాన్ని భవిష్యత్‌ పరిహార సెస్‌ వసూళ్ల నుంచి తిరిగి రాబట్టుకోవడం జరుగుతుందన్నారు. ఇందు లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.689 కోట్లు, తెలంగాణకు రూ.548 కోట్ల మొత్తం పరిహారంగా లభించనుంది.