Dahod, May 27: దేశంలో ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా యువతులు, మహిళపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. ఎఖ్కడ చూసినా అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుజరాత్ రాష్ట్రంలో ఓ టీచర్.. స్టూడెంట్‌ను (17-Year-Old Girl Raped) లైంగికంగా హిసించి గర్భవతిని చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాహోద్ జిల్లాలోని జలోద్‌లో ఓ విద్యార్థిని(17).. నైనేష్ దామోరా ఆధ‍్వర్యంలో నడిచే కోచింగ్ క్లాసులకు వెళ్తోంది. ఈ క్రమంలో ఓ రోజు.. దామోరా.. విద్యార్థిని వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు వీడియోను రికార్డు చేశాడని బాధితురాలు తెలిపింది. కోల్‌కతాలో ఏం జరుగుతోంది, మూడు రోజుల్లో రెండో మోడల్ ఆత్మహత్య, ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న మంజుషా నియోగి
అనంతరం ఆ వీడియోను చూపించి.. ఆమెను దామోర్ బెదిరింపులకు గురిచేశాడు. ఆ తర్వాత వీడయోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసి తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. ఈ వీడియోను ఆసరాగా చేసుకుని ఆమెపై టీచర్ పలుమార్లు లైంగిక దాడి చేయగా బాధితురాలు గర్భం (Impregnated by Tuition Teacher in Dahod) దాల్చింది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసినట్టు జలోద్ సర్కిల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ హెచ్‌సీ రత్వా తెలిపారు. అనంతరం బాలికను ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు.