Gandhi Nagar, Dec 26: గుజరాత్ కు చెందిన 24ఏళ్ల యువతి తను ప్రేమించిన వాడి కోసం పరీక్ష రాస్తూ (Woman Attends Boyfriend’s Exam) పట్టుబడింది. ఈ ఏడాది అక్టోబరులో జరిగిన బీకామ్ తృతీయ సంవత్సరం పరీక్షలను అతని స్థానంలో ఆమె రాస్తూ అధికారులకు పట్టుబడింది. తాను పరీక్ష హాలులోకి వెళ్లేందుకు వీలుగా కంప్యూటర్ సాయంతో హాల్ టికెట్ లో చిన్న చిన్న మార్పులు చేసినట్లు ఆ యువతి తెలిపింది.
ఐడియా అదుర్స్! కరోనా నుంచి కాపాడుకునేందుకు చైనా జంట వినూత్న ప్రయోగం, నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
అలాగే పేరులోనూ స్వల్ప మార్పులు చేసినట్లు చెప్పింది. తన వేషధారణను మార్చుకున్నట్లు తెలిపింది. పరీక్షల సమయంలో రోజూ ఇన్విజిలేటర్లు మారుతుంటారు. వారు ప్రతి విద్యార్థిని వ్యక్తిగతంగా గమనించరు. అయితే హాల్ టికెట్లు పరిశీలిస్తారు. ఆ సమయంలో ఇన్విజిలేటర్ కు అనుమానం వచ్చింది. ఆ విధంగా ఆ యువతి పట్టుబడింది.
అయితే ప్రియురాలితో ఎగ్జామ్ రాయిస్తున్న ఆ ప్రియుడిలో మాత్రం ఎలాంటి టెన్షన్ లేదు. హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నాడు. పరీక్ష హాల్‌లో ప్రియురాలు చిక్కుకున్న తర్వాత ఎగ్జామ్ రాయాల్సిన వ్యక్తికి అధికారులు ఫోన్ చేశారు. అతని సమాధానం విని వాళ్లంతా షాక్ అయ్యారు. ప్రియురాలిని ఎగ్జామ్‌కు పంపించిన ఆ వ్యక్తి పరీక్ష కేంద్రం పరిసరాల్లోనే ఉంటాడని వాళ్లు అనుకున్నారు. కానీ ఆ ప్రియుడు చెప్పిన వివరాలు అందర్నీ ఆశ్చర్యంలో పడేశాయి. తాను ఉత్తరాఖండ్ లో వెకేషన్‌లో (vacation in Uttarakhand) ఉన్నట్టు చెప్పడంతో అక్కడి వారంతా ముక్కున వేలేసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆ యువతి డిగ్రీని రద్దు చేయాలని ఫాక్ట్ కమిటీ (ఫెయిర్ అసెస్ మెంట్ అండ్ కన్సల్టేటివ్ టీమ్ కమిటీ) వీఎన్ ఎస్ జీయూకి (వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్శిటీకీ) సిఫార్సు చేసింది. ఆ సిఫార్సు ఆమోదిస్తే ఆ మహిళ తన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కోల్పోయే ప్రమాదముంది. అలాగే నిజమైన అభ్యర్థిని మూడేళ్లపాటు పరీక్షకు హాజరు కాకుండా డిబార్ చేసే అవకాశముంది.