crime-scene

హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం చోటుచేసుకున్నది. సహజీవనం చేస్తున్న వ్యక్తి తలపై, మెడపై పాన్‌తో కొట్టి హత్య చేసిందని ఓ మహిళపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.తిక్రి గ్రామంలో తన సోదరుడి సహాయంతో మహిళ హత్య చేసిందని పోలీసులు తెలిపారు.గురుగ్రామ్‌లోని అశోక్ విహార్‌లో నివాసం ఉంటున్న నీతు అలియాస్ నిషా (34), విక్కీ (28) గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆ మహిళకు వివాహమైనా భర్త నుంచి విడిపోయింది. ఆమె 15 ఏళ్ల పాపకు తల్లి అని పోలీసులు తెలిపారు.  ఇంట్లో ప్రియుడితో కూతురిని చూసిన తల్లి, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చూస్తూ కుమార్తెకు ఉరివేసి చంపిన తల్లి, ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కేసు వివరాలను వెల్లడించిన పోలీసులు

సిటీ కోర్టు నీతూకి ఒకరోజు కస్టడీ విధించిందని పోలీసులు తెలిపారు. మహిళ సోదరుడు పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం అర్థరాత్రి కచ్చి కాలనీలోని ఓ ఇంట్లో విక్కీ శవమై కనిపించాడు. విక్కీని ఎవరో హత్య చేశారని అతని సోదరుడు ఫిర్యాదు చేశాడు. శనివారం సదర్ పోలీస్ స్టేషన్‌లో 302 (హత్య), 34 (సాధారణ ఉద్దేశ్యం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.సదర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ అర్జున్ దేవ్ నేతృత్వంలోని పోలీసు బృందం కేసును ఛేదించి ఆదివారం ఘటా గ్రామానికి చెందిన నీతును అరెస్టు చేసింది.ఆమె వద్ద నుంచి విక్కీ మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు కన్నతండ్రిని ప్రియుడు చేత దారుణంగా చంపించిన కూతురు, అన్నమయ్య జిల్లాలో విషాదకర ఘటన

ఎస్‌హెచ్‌ఓ మాట్లాడుతూ, "శుక్ర, శనివారాల్లో రాత్రి మృతి చెందిన వ్యక్తొతో పాటు మహిళ ఆమె సోదరుడు గదికి చేరుకున్నారని, ఆమె సోదరుడు, విక్కీ మద్యం సేవించారని, ఆ తర్వాత వారి మధ్య వాగ్వాదం జరిగిందని నిందితురాలు నీతూ వెల్లడించింది. ఇంతలో నీతు విక్కీపై దాడికి పాల్పడింది. అతని మెడ, తలపై పాన్‌తో బలంగా కొట్టింది. దీంతొ విక్కీ చనిపోయాడు. "నేరం చేసిన తర్వాత, ఆమె పోలీసులను తప్పుదారి పట్టించడానికి మృతుడి మొబైల్‌తో పారిపోయింది, కానీ మేము ఆమెను అరెస్టు చేసాము. మేము ఆమెను ప్రశ్నిస్తున్నాము. ఆమె సోదరుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం" అని ఎస్‌హెచ్‌ఓ మిస్టర్ దేవ్ చెప్పారు.