Crime Representational Image (File Photo)

Hyd, Mar 20: ఇబ్రహీంపట్నం దండుమైలారంలో ప్రేమ వ్యవహారం పరువు హత్యకు దారితీసిన సంగతి విదితమే. నవ మాసాలు మోసి కన్న తన కూతురునే ఓ తల్లి కడతేర్చింది. తాజాగా యువతి అనుమానాస్పద మృతి కేసును.. పోలీసులు ఎట్టకేలకు పరువు హత్యగా (19-Year-Old Girl Strangled to Death by Mother ) తేల్చారు. భార్గవి(19)ని తల్లే చంపిందని.. ప్రియుడితో కలిసి కూతురు కనిపించేసరికి భరించలేక తల్లి జంగమ్మ ఉరేసి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు.

దండుమైలారం గ్రామానికి చెందిన మోటే ఐలయ్య, జంగమ్మ దంపతులకు కుమార్తె భార్గవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్గవి హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల భార్గవి తల్లిదండ్రులు మేనమామను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆమె తాను స్థానికంగా ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని ( Love Affair in Ibrahimpatnam)అతన్నే పెళ్లి చేసుకుంటానంది. దీంతో ఇంట్లో గొడవలు జరిగాయి. హైదరాబాద్‌లో తొలిసారి, భార్యను పొడిచి చంపిన భర్తకు ఉరిశిక్ష విధించిన కోర్టు, కత్తెరతో గొంతులో, స్క్రూ డ్రైవర్‌తో ప్రైవేట్ భాగాల్లో దారుణంగా..

ఈ క్రమంలో మూడు రోజులపాటు భార్గవి కాలేజీకి కూడా వెళ్లలేదు. సోమవారం తల్లిదండ్రులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా ఆ సమయంలో సదరు యువకుడు.. భార్గవి ఇంటికి వచ్చి ఆమెతో మాట్లాడుతుండగా తల్లి జంగమ్మ ఇంటికి వచ్చింది. కుమార్తెపై తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడి చేసి, చీరతో ఉరి వేసి హతమార్చింది.

ఈలోపు భర్త, కొడుకు ఇంటికి వచ్చేసరికి స్పృహ కోల్పోయినట్లు నటించి.. కూతురిని ఎవరో చంపేశారని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే.. అక్కను తల్లే చంపి ఉంటుందని భార్గవి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు తాను చంపలేదని జంగమ్మ, తన భార్య చంపి ఉండకపోవచ్చని ఆమె భర్త వాదించారు. ఈ క్రమంలో ప్రియుడి పాత్రపైనా పోలీసులు అనుమానాలు మళ్లాయి. అయితే.. తమదైన శైలిలో ఈ కేసును విచారించగా.. చివరకు కూతురిని తానే ఉరేసి చంపిటనట్లు జంగమ్మ అంగీకరించింది.