Delhi, Nov 25: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో జరుగుతున్న ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు పై ఆయన ఘాటుగా స్పందించారు. మా పార్టీ నేతలు సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా అవినీతిపరులట.... కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలను 24 గంటల పాటు (Hand me CBI, ED for a day) నాకు అప్పగిస్తే బీజేపీలోని సగం మంది నేతలు జైల్లో ఉంటారు అని స్పష్టం (BIG warning to BJP) చేశారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ వారి చేతిలోనే కీలు బొమ్మలు అయ్యాయని మండిపడ్డారు. తమకు వ్యతిరేకంగా అనేక కేసులు పెట్టారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. మనీష్ సిసోడియా లిక్కర్ స్కాంలో రూ.10 కోట్లు తిన్నాడని అంటున్నారని, వారి చేతుల్లో ఉన్న దర్యాప్తు సంస్థల సాయంతో ఆ విషయం నిరూపించవచ్చు కదా అని నిలదీశారు.
ఆమ్ ఆద్మీ నేతలపై 200 కేసులు నమోదు చేసినా, వాటిల్లో ఒక్కటీ కూడా నిరూపించలేకపోయారని స్పష్టం చేశారు. 150 కేసుల్లో తమ నేతలకు క్లీన్ చిట్ వచ్చిందని, మిగిలిన కేసులు పెండింగ్ లో ఉన్నాయని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.