Ministry of Home Affairs. (Photo Credits: ANI)

శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఇటీవల పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై కలకలం రేగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రేపటి (ఏప్రిల్‌ 6) హనుమాన్‌ జయంతి (Hanuman Jayanti) ఉత్సవాలకు అడ్వైజరీ జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ (MHA) ట్విటర్‌లో వెల్లడించింది. పండగ శాంతియుతంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలి. ఆ సమయంలో శాంతి భద్రతలను పరిరక్షించాలని అన్ని రాష్ట్రాలకు హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

హనుమాన్ జయంతి రోజు వీర ఆంజనేయడి పూజలో ఈ తప్పులు చేశారో, సకల దరిద్రాలు మీ వెంట పడటం ఖాయం..

శ్రీరామనవమి సందర్భంగా ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర అల్లర్లు చెలరేగి పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. హనుమాన్‌ జయంతి (Hanuman Jayanti) ఏర్పాట్ల నిమిత్తం అన్ని రాష్ట్రాలకు హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. పండగ శాంతియుతంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలి. ఆ సమయంలో శాంతి భద్రతలను పరిరక్షించాలి. సమాజంలో మత సామరస్యానికి భంగం కలిగించే ముప్పును నిరంతరం పర్యవేక్షించాలి’’ అని హోంశాఖ రాష్ట్రాలను కోరింది.

దేశంలో 24 గంటల్లో 4,435 కొత్త కేసులు నమోదు, రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో ఆందోళన, ప్రస్తుతం 23,091 కేసులు యాక్టివ్‌

నవమి ఉత్సవాల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో.. హనుమాన్‌ జయంతి ఉత్సవాల్లో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు కేంద్ర బలగాల సాయం తీసుకోవాలని బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. రాష్ట్రం అభ్యర్థనను స్వీకరించి కేంద్ర బలగాలు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించింది. రాష్ట్రంలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి వేసిన పిటిషన్‌పై విచారణ చేసిన న్యాయస్థానం.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.