హర్యానా లోని రోహ్‌తక్ జిల్లాలో తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది. ఓ కసాయి తండ్రి నలుగురి పిల్లలకు విషం ఇచ్చాడు. ముగ్గురు పిల్లలు మృతి చెందగా మరో పిల్లవాడు కొనఊపిరితో ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు.
విషాదకర ఘటన వివరాల్లోకి కెళ్తే. హర్యానాలోని రోహతక్ జిల్లాలో కాబూల్ పూర్ గ్రామంలో దంపతలిద్దరూ, వారితో పాటు నలుగురు పిల్లలు నివాసం ఉంటున్నారు. అతను ఆ గ్రామంలోనే కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే సునీల్ కుమార్ భార్య లేని సమయం చూసి నలుగురు పిల్లలకి విషం ఇచ్చాడు.
దారుణం, పదేళ్ల బాలుడు పొట్టను చీల్చి, పేగులను బయటకు లాగి చంపేసిన కోతులు
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఘటనా స్థలానికి చేరుకుని నలుగురు పిల్లల్ని ఆసుపత్రిలో తీసుకెళ్తుండగా.. మార్గమద్యంలోనే ముగ్గురు పిల్లలు చనిపోయారు. వారిలో ఇద్దరు అక్కాచెల్లెలు. ఒకరికి 10 సంవత్సరాలు, మరొకరిది 7 సంవత్సరాల వయస్సు కలవారు. మరో పిల్లవాడు మృతి చెందగా.. ఎనిమిదేళ్ల సోదరి మాత్రం రోహతక్ లోని పిజీఐఎంఎస్ ఆసుపత్రి లో చికిత్స పొందుతుంది. దారుణానికి పాల్పడిన కుమార్ పరారిలో ఉన్నాడని.. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు.