Representative (Image: Credits: PTI)

New Delhi, May 01: దేశవ్యాప్తంగా ఎండలు (Heat wave) పెరిగిపోతున్న దృష్ట్యా కేంద్రం అప్రమత్తమైంది. ఎండల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు పలు సూచనలు చేసింది. కేంద్రం చేసిన కొన్ని సూచనలివి. రోజులో కావాల్సినన్ని నీళ్లు తాగాలి. అవసరమైతే ఓఆర్ఎస్ (ORS)వంటి డ్రింక్స్ కూడా తీసుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు (Fruits), కూరగాయలు తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులే ధరించాలి. అవి కూడా లైట్ కలర్స్ మాత్రమే. బయటకు వెళ్లినప్పుడు తలపై టోపీ, హ్యాట్, టవల్, కర్చీఫ్ వంటివి ధరించాలి. గొడుగు వాడాలి. ఎండ నేరుగా తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండను భరించలేని వాళ్లు, పిల్లలు, గర్భిణులు, శిశువులు, మానసిక సమస్యలు ఉన్నవాళ్లు, ఎండలో, బయట పనిచేసేవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఎండ ఎక్కువగా ఉండే సమయంలో బయటకు వెళ్లడాన్ని తగ్గించుకోవాలి. అందులోనూ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఈ సమయంలో ఆరుబయట వంట కూడా చేయకూడదు. మరోవైపు రాష్ట్రాలకు కూడా పలు సూచనలు చేసింది. ఎండ, వడగాడ్పుల విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. ప్రజలకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలని చెప్పింది.

Coronavirus in India: ఇవాళ కూడా మూడువేలు దాటిన రోజువారీ కరోనా కేసులు, ఢిల్లీలోనే సగానికి పైగా కేసులు నమోదు, భారీగా పెరుగుతున్న కేసులతో అలర్టయిన ఆరోగ్యశాఖ  

అయితే ఢిల్లీతో (Delhi) పాటూ ఉత్తరాదికి చెందిన కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొంత తగ్గే అవకాశముందని ఐఎండీ తెలిపింది. అయితే ఏప్రిల్‌ నెలలో 122 ఏళ్ల రికార్డుస్థాయి ఎండలు నమోదయ్యాయని, మే నెలలో కూడా ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశముందని తెలిపింది. దీంతో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం రానున్న మూడు రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.