Henley Passport Index 2024: భారత్ పాస్‌పోర్ట్ ఉన్న‌వాళ్లు వీసా లేకుండా 62 దేశాల‌కు వెళ్లవచ్చు, అత్యంత శ‌క్తివంత‌మైన పాస్‌పోర్ట్ ర్యాంకుల్లో 80వ స్థానంలో ఇండియా
Indian Passport | Representational Image (Photo Credits: Pixabay)

India stands 80th rank in the list of most powerful passports: ప్రపంచంలో అత్యంత శ‌క్తివంత‌మైన పాస్‌పోర్ట్ ర్యాంకుల‌ను హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ రిలీజ్ చేసింది. ఈ లిస్టులో టాప్ ప్లేస్‌లో ఆరు దేశాలు ఉన్నాయి. ఫ్రాన్స్, జ‌ర్మ‌నీ, ఇట‌లీ, జ‌పాన్‌, సింగ‌పూర్ దేశాలు నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉన్నాయి. ఇక ఇండియా ర్యాంకు 80వ స్థానంలో ఉన్న‌ది. ఈ ఆరు దేశాల పాస్‌పోర్టులు ఉన్న‌వాళ్లు 194 దేశాల‌కు వీసా లేకుండానే ఎంట్రీ ఇవ్వొచ్చు. ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేష‌న్ ఇచ్చిన డేటా ఆధారంగా ఈ ర్యాంక్‌ల‌ను ప్ర‌క‌టించారు.

గొడ్డు మాంసం వ్యాపారంలోకి అడుగుపెట్టిన మార్క్ జుకర్‌బర్గ్, ప్రపంచంలోనే అత్యుత్తమ గొడ్డు మాంసం ఉత్పత్తి చేస్తానని వెల్లడి

ఫిన్‌ల్యాండ్, స్వీడెన్‌, సౌత్ కొరియా దేశాలు సంయుక్తంగా రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. ఈ దేశ పాస్‌పోర్టులు ఉంటే 193 దేశాల‌కు వీసా లేకుండా వెళ్ల‌వ‌చ్చు. ఆస్ట్రియా, డెన్మార్క్‌, ఐర్లాండ్‌, నెద‌ర్లాండ్స్ దేశాలు మూడ‌వ స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్ ఉంటే 192 దేశాల‌కు వీసా లేకుండా వెళ్ల‌వ‌చ్చు.ఇండియా పాస్‌పోర్ట్ 80వ స్థానంలో ఉన్న‌ది. ఇండియా పాస్‌పోర్ట్ ఉన్న‌వాళ్లు 62 దేశాల‌కు వీసా లేకుండానే వెళ్ల‌వ‌చ్చు. ర్యాంకింగ్‌లో పొరుగు దేశం పాకిస్థాన్ 101వ స్థానంలో ఉన్న‌ది.