Himanta Biswa Sarma Sworn-In: అసోం సీఎంగా హిమంత విశ్వ శర్మ ప్రమాణస్వీకారం, ఆయనతో ప్రమాణం చేయించిన గవర్నర్‌ జగదీశ్‌ ముఖి, హాజరైన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ నేతలు
Assam Minister Himanta Biswa Sarma (Photo Credits: IANS)

Guwahati, May 10: అసోం రాష్ట్ర ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ నేడు ప్రమాణ స్వీకారం (Himanta Biswa Sarma Sworn-In) చేశారు. గవర్నర్‌ జగదీశ్‌ ముఖి ఆయనతో ప్రమాణం చేయించారు. హిమంత బిశ్వ‌శ‌ర్మ (Himanta Biswa Sarma) అసోంకి 15వ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగ‌నున్నారు. ఈ ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, త్రిపుర, మేఘాలయ, మణిపూర్‌, నాగాలాండ్ సీఎంలు బిప్లవ్‌ దేవ్‌, కాన్రాడ్‌ సంగ్మా, బీరేన్‌ సింగ్‌, నేపియూ రియో హాజ‌ర‌య్యారు.

రాజకీయ వ్య‌వ‌హారాల్లో చాలా చురుకుగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని హిమంతకు మంచి పేరు ఉంది. అసోం ఎన్నికల్లో బీజేపీ మ‌ళ్లీ అధికారంలోకి రావడంలో ఆయన కీలక పాత్ర పోషించడంతో పార్టీ అధిష్ఠానం దృష్టిని ఆక‌ర్షించారు. ఎన్నికలకు ముందు ఏడాదిపాటు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయ‌న ఉన్నారు. ఆ స‌మ‌యంలో రాష్ట్రంలో కరోనా క‌ట్ట‌డి కోసం సమర్థంగా ప‌నిచేశార‌ని ప్రశంసలు అందుకున్నారు.

Here's ANI Update: 

బీజేపీ శాసనసభా పక్ష నేతగా శర్మ సోమవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్డీయే పక్ష నేతగానూ ఎంపికయ్యారు. ముఖ్యమంత్రి పదవికి శర్మ పేరును మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ ప్రతిపాదించారు. సోనోవాల్‌కు కేంద్ర కేబినెట్‌లో స్థానం దొరికే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 125 సీట్లకు ఎన్డీఏకు 75 సీట్లు వచ్చాయి.