Murder (Photo Credits: Pixabay)

చెన్నై, ఫిబ్రవరి 1: తమిళనాడులోని తిరుమంగళం సమీపంలోని కొంబాడి గ్రామంలో మంగళవారం రాత్రి 22 ఏళ్ల యువకుడు తన అక్కను, ఆమె ప్రియుడిని దారుణంగా హత్య చేశాడు. ఎ ప్రవీణ్ కుమార్ అనే నిందితుడు వారి సంబంధాన్ని వ్యతిరేకించాడు. మానుకోవాలని ఇద్దరినీ చాలాసార్లు హెచ్చరించాడు.ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం , బాధితులు, ఎ మహా లక్ష్మి (25), ఎన్ సతీష్ కుమార్ (28) ఒకే గ్రామానికి చెందినవారు. ఇద్దరు వెనుబడిన కులాలకు చెందినవారు. విడాకులు తీసుకున్న మహాలక్ష్మి తన తల్లి, సోదరుడితో కలిసి ఉండగా సతీష్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

మంగళవారం రాత్రి ప్రవీణ్‌కుమార్‌, అతని స్నేహితులు ప్రవీణ్‌, వేలు, రంజిత్‌లు సతీష్‌ ఇంటిపై మెరుపుదాడి చేసి పదునైన ఆయుధంతో తల నరికి చంపారు. అనంతరం అతని మృతదేహాన్ని సమీపంలోని పొలంలో పడేశారు. అనంతరం ప్రవీణ్ కుమార్ తన ఇంటికి వెళ్లి అదే ఆయుధంతో సోదరిపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వారి తల్లి ఎ సెల్వి అలియాస్ చిన్నపిడారి (45) అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆమె మణికట్టుకు గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తెలంగాణలో మూడో పరువు హత్య, కులాంతర వివాహం చేసుకుందని కూతురును నడిరోడ్డు మీద కత్తితో పొడిచి చంపిన తండ్రి, అదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన

సమాచారం అందుకున్న కూడకోవిల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్‌కుమార్‌తో పాటు అతని సహచరులను అరెస్టు చేసి, నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రవీణ్ కుమార్ సోమవారం తన సోదరి, సతీష్‌లను సన్నిహితంగా చూశారని, దీంతో ఆగ్రహానికి గురయ్యారని పోలీసులు తెలిపారు. అనంతరం స్నేహితుల సాయంతో వారిని హతమార్చాలని ప్లాన్‌ చేశాడు. ఈ కేసులో కుల కోణం లేదని పోలీసులు తేల్చిచెప్పారు. ఇది పూర్తిగా పరువు హత్య అని అన్నారు. వారు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 294 (బి), 506 (ii), 307, 302 సెక్షన్లు, తమిళనాడు మహిళా వేధింపుల నిషేధ చట్టంలోని సెక్షన్ 4 కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది.