hyderabad-man-give-triple-talaq-to-his-wife-due-to-not-giving-birth-to-baby-boy (Photo-ANI)

Hyderabad, November 19: ట్రిపుల్ తలాక్ చట్టం (Triple-Talaq) ముస్లిం మహిళలకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతోంది. అర్థం పర్థం లేని కారణాలను సాకుగా చెప్పి ట్రిపుల్ తలాక్ అనే మూడు మాటలతో భార్యల్ని వదిలించుకుంటున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. అలా వదిలించుకుని వారంతా మరో పెళ్లికి సిద్ధపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం తన భార్య పళ్లు ఎత్తుగా ఉన్నాయనే సాకుతో ఓ భర్త తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన ఘటన హైదరాబాద్‌(Hyderabad)లో జరిగింది.

అలాగే కూర బాగాలేదని బిర్యానీ చేయలేదని మరొకరు, నువ్వు అందంగా లేవని ఇంకొకరు ఇలా వారి పైత్యానికి ముస్లిం మహిళలు బలవుతూనే ఉన్నారు. తాజాగా మగ పిల్లాడు పుట్టలేదని (wife for not giving birth to a boy) ఓ ప్రబుద్ధుడు భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది.

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధిత మహిళ

మగ బిడ్డను కనలేదని తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. భర్త ట్రిపుల్ తలాక్ చెప్పడంతో భార్య పోలీసులను ఆశ్రయించింది. మెహ్రన్ బేగం (Mehraj Begum) అనే మహిళ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ లో నివసిస్తున్నారు. అయితే తనకు మగపిల్లలు పుట్టడం లేదని తన భర్త ట్రిపుల్ తలాక్ ఇచ్చాడని చెప్పింది.

దీంతో పాటే అతను వేరే అమ్మాయిని పెండ్లి చేసుకుంటున్నట్లు తెలిపింది. నాకు న్యాయం చేయమని కోరుకుంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనకు అన్యాయం చేసిన అతనికి శిక్ష పడాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. మెహ్‌రాజ్ బేగం ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు (triple-talaq Case registered) చేశారు.