Delhi, February 12: మెట్రో నగరాలలో సబ్సిడీయేతర (non-subsidised) వంటగ్యాస్ (LPG) సిలిండర్ల ధరలు పెరిగాయి. 14.2 కిలోల ఇండేన్ గ్యాస్ సిలిండర్‌పై ఒక్కసారిగా రూ. 144.50 పెంచారు. దీంతో ప్రస్తుతం రూ. 714 గా ఉన్న ధర, రూ. 858.50 కు పెరిగింది. ఈ పెరిగిన ధరలు (Price Hike) నేటి నుంచే అమలులోకి రానున్నాయి.
కాగా, సిలిండర్ల ధరల పెరుగుదలతో పాటే అదే క్రమంలో కేంద్రప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని కూడా రెట్టింపు చేయడం గమనార్హం. గృహ వినియోగదారులకు ఒక సిలిండర్‌పై లభించే రాయితీని రూ. 153.86 నుంచి రూ. 291.48 కు పెంచారు.
ఇక ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన (పిఎంయువై) లబ్ధిదారులకు సబ్సిడీ సిలిండర్‌పై లభించే రాయితీ కూడా రూ. 174.86 నుంచి రూ. 312.48 కు పెరిగింది.
ఎల్‌పిజి వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమచేయబడే ఈ సబ్సిడీని పరిగణలోకి తీసుకుంటే, గృహ వినియోగదారులకు 14.2 కిలోల సిలిండర్‌కు అయ్యే ఖర్చు రూ. 567.02 కాగా, పిఎంయువై వినియోగదారులకు రూ. 546.02 ఖర్చవుతుంది.
Check ANI's Update:
Prices of non-subsidised 14 kg Indane gas in metros, applicable from today: In Delhi price rises to Rs 858.50 (increase by Rs 144.50), in Kolkata - Rs 896.00 (increase by Rs 149), in Mumbai - Rs 829.50 (increase by Rs 145), in Chennai - Rs 881.00 (increase by Rs 147). pic.twitter.com/0kbynJJld7
— ANI (@ANI) February 12, 2020
గృహాల్లో, వంటశాలల్లో పర్యావరణ హితమైన ఇంధనం ఉపయోగించడాన్ని పెంచేలా పిఎంయువై పథకం కింద పేద మహిళలకు కేంద్ర ప్రభుత్వం 8 కోట్ల ఉచిత ఎల్పిజి కనెక్షన్లను ఇచ్చింది.
సాధారణంగా, ఎల్‌పిజి రేట్లు ప్రతి నెల 1వ తేదీన సవరించబడతాయి, అయితే ఈసారి సమీక్ష జరగడానికి ఓ రెండు వారాలు ఆలస్యమైంది. సబ్సిడీని పెద్దమొత్తంలో పెంచుతున్నందున వాటి అనుమతుల కోసం కొంత ఆలస్యం జరిగిందని అధికారులు చెప్పారు. అయితే మధ్యలో ఫిబ్రవరి 08న దిల్లీ ఎన్నికలు రావడం వల్ల, ఎల్పీజీ ధరల పెరుగుదలను ఆలస్యం చేశారని విమర్శలు వస్తున్నాయి.