COVID19 in India: భారత్‌లో భారీగా తగ్గిన రోజూవారీ కోవిడ్ కేసులు.. కొత్తగా 35,342 కేసులు మరియు 483 మరణాలు నమోదు; గడిచిన ఒక్కరోజుల్లో మరో 38,740 మంది రికవరీ
Coronavirus | Image used for representational purpose | (Photo Credits: PTI)

New Delhi, July 23: భారత్‌లో రోజూవారీ కోవిడ్ కేసులు ఇటీవల కాలంగా సుమారు 40 వేల మార్కు వద్ద స్థిరంగా కొనగాతున్నాయి. కాగా, గడిచిన ఒక్కరోజులో మాత్రం గణనీయమైన తగ్గుదల కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే శుక్రవారం నాటి రిపోర్ట్ ప్రకారం సుమారు 6 వేల మేర తక్కువగా నమోదయ్యాయి. అలాగే మరణాలు కూడా 5 వందల లోపే నమోదు కావడం విశేషం. అయితే కోలుకునే వారి సంఖ్యలో పెద్దగా మార్పులు లేకపోవడంతో ఆక్టివ్ కేసుల సంఖ్య తగ్గుదల నెమ్మదించింది. మరోవైపు థర్డ్ వేవ్ అనివార్యం అన్న భయాందోళనల నేపథ్యంలో గురిపూర్ణిమ సందర్భంగా హరిద్వార్ వచ్చే భక్తులకు 72 గంటల లోపు తీసుకున్న ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేశారు. కరోనా నేపథ్యంలో పరిమిత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. .

ఇక, గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 35,342 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,12,93,062 కు చేరింది. నిన్న ఒక్కరోజే 483 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,19,470 కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 38,740 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,04,68,079 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 4,05,513 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.36% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.30 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.34% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

జూలై 21 నాటికి దేశవ్యాప్తంగా 45,29,39,545 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 16,68,561 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 54,76,423 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 42.34 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 42,34,17,030 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 33.39 కోట్లు ఉండగా, 8.94 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.