New Delhi, August 24: దేశంలో నిన్న 25,467 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,24,74,773కు (Coronavirus in India) చేరింది. అలాగే నిన్న కరోనా నుంచి 39,486 మంది కోలుకున్నారు. నిన్న 354 మంది మృతి (Covid Deaths) చెందారు. మృతుల సంఖ్య మొత్తం 4,35,110కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,17,20,112 మంది కోలుకున్నారు. 3,19,551 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. అలాగే, దేశంలో నిన్న 63,85,298 వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్పటివరకు మొత్తం 58,89,97,805 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్రకటించారు.
పైజర్-బయోటెక్ సంయుక్తంగా తయారు చేసిన కోవిడ్-19 వ్యాక్సీన్ బూస్టర్ డోసు తీసుకున్న 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు తిరిగి కరోనా సోకడం లేదా తీవ్ర అనారోగ్యం పాలవడం లాంటి సమస్యలు ఎదురుకావడం బహు స్వల్పమని పరిశోధనల్లో తేలింది. ఇజ్రాయెల్ ఆరోగ్యమంత్రిత్వశాఖ నుంచి అందిన రిపోర్టు ప్రకారం ఫైజర్ వ్యాక్సీన్‌కు సంబంధించి రెండు డోసుల టీకా తీసుకున్న తరువాత మూడవ డోసు టీకా తీసుకోవడం వలన అత్యధిక రక్షణ లభిస్తున్నదని తేలింది.
మూడవ డోసు టీకా తీసుకున్న వారిని పరీక్షించిన అనంతరం వైద్య నిపుణులు ఈ విషయాన్ని ప్రకటించారు. 60 ఏళ్లు పైబడిన వారు టీకా మూడవ డోసు తీసుకున్న తరువాత వారికి కరోనా నుంచి నాలుగింతల రక్షణ లభిస్తున్నదని గుర్తించారు.