Coronavirus-in-India ( photo-PTI)

New Delhi, Aug 18: దేశంలో కొత్త‌గా నిన్న 35,178 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,22,85,857కు (Covid in India) చేరింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 37,169 మంది (Coronavirus) కోలుకున్నారు.ఇక మరణాల విషయానికొస్తే... నిన్న 440 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,32,519కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,14,85,923 మంది కోలుకున్నారు. 3,67,415 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. అలాగే, దేశంలో నిన్న 55,05,075 వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 56,06,52,030 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో కెనడాకు చెందిన హెల్త్ ఏజెన్సీ ఒక సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ సోకే ప్రమాదం 14-17 ఏళ్ల పిల్లల్లో ఎక్కువగా ఉంటుందని, 0-3 ఏళ్ల వయసున్న పిల్లలకు కరోనా సోకే ప్రమాదం తక్కువని ఈ సర్వే తేల్చింది. అయితే ఒకసారి పసివాళ్లకు కరోనా సోకితే మాత్రం.. పసివాళ్ల నుంచి ఇది ఇతరులకు వ్యాపించే అవకాశం 43 శాతం ఎక్కువగా ఉందని తెలిపింది.

పెగాస‌స్ కేసులో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు, ప‌దిరోజుల్లో దీనిపై నివేదిక అందజేయాలని ఆదేశాలు, వీటిపై బ‌హిరంగంగా చ‌ర్చించ‌లేమ‌ని కోర్టుకు నివేదించిన తుషార్ మెహ‌తా

దీన్ని అర్థం చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పసివాళ్లకు కరోనా సోకితే వారిని ఐసోలేట్ చేయలేమని, ఎవరో ఒకరు వారి బాగోగులు చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో పిల్లల కేర్‌గివర్స్, తోబుట్టువులకు కరోనా సోకే ప్రమాదం ఉందనేది నిపుణుల అభిప్రాయం. ప్రముఖ జామా పీడియాట్రిక్స్‌ జర్నల్‌లో ఈ సర్వే వివరాలు ప్రచురితమయ్యాయి. కరోనా సోకిన చిన్నారుల వల్ల వైరస్ వేగంగా వ్యాపిస్తుందా? లేక పెద్ద వారి వల్ల వ్యాపిస్తుందా? అనే అంశంపై ఇప్పటికే అంతర్జాతీయంగా ఒక వాదన నడుస్తోంది.

చర్చలేకుండా ఎలా ఆమోందించారు, ట్రైబ్యునళ్ల సంస్కరణల బిల్లు ఆర్డినెన్స్ కొట్టివేసినా బిల్లులోకి ఎలా చేర్చారని కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు, ట్రిబ్యునళ్లకు నియామకాలు 10 రోజుల్లో చేపట్టాలని ఆదేశం

ఈ తాజా సర్వే ఈ వాదనకు సమాధానం ఇవ్వలేదు. అయితే 14-17 ఏళ్ల వయసు పిల్లలకు బయట కరోనా సోకే అవకాశం ఉందని, ఇది 0-3 సంవత్సరాల వయసున్న పిల్లల్లో చాలా తక్కువ అని సర్వేలో తేలింది. అదే సమయంలో 14-17 ఏళ్ల పిల్లల నుంచి తక్కువ మందికి వైరస్ సోకితే, 0-3 సంవత్సరాల పిల్లల నుంచి ఎక్కువ మందికి కరోనా సోకే ప్రమాదం ఉందని ఈ సర్వేలో తేల్చింది.