New Delhi, July 28: దేశంలో మరోసారి కొత్త కేసులు, మరణాలు పెరిగాయి. మంగళవారం 17,36,857 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 43,654 మందికి వైరస్ (India logs 43,654 new Covid-19 cases) సోకింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 47 శాతం పెరుగుదల కనిపించింది. నిన్న మరో 640 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో 3.14 కోట్ల కేసులు వెలుగుచూడగా.. 4,22,022 మంది మహమ్మారికి బలయ్యారని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక నిన్న 41,678 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మరోసారి రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తం రికవరీలు 3.06 కోట్లకు చేరగా.. రికవరీరేటు 97.39 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 3,99,439 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీలరేటు 1.27 శాతంగా ఉంది. మరోవైపు నిన్న 40,02,358 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 44,61,56,659కి చేరింది.
ఇదిలా ఉంటే కొత్త వేరియంట్లతో రీ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయి. వాక్సిన్ తీసుకున్నా వైరస్ మళ్లీ సోకుతోంది. తాజాగా ఓ 26 ఏళ్ల వైద్యురాలు (Dr Shrusthi Halari) 13 నెలల్లో మూడుసార్లు కరోనా బారినపడ్డారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు సైతం వైరస్ సోకింది. వ్యాక్సిన్ రెండు మోతాదులు తీసుకున్న తర్వాత వైరస్ (Mumbai Doctor Tests Positive) బారినపడ్డట్లు బాధిత వైద్యురాలే తెలిపారు.
ముంబై నగరంలోని ములుండ్ కొవిడ్ సెంటర్‌లో పని చేసిన వైద్యురాలు శ్రుతి హలారి మూడుసార్లు వైరస్ బారినపడగా.. అధ్యయనంలో భాగంగా జన్యుశ్రేణి పరిశీలన కోసం నమూనాలను సేకరించారు. వైద్యురాలు శృతి మూడోసారి కరోనా పాజిటివ్‌కు పరీక్షించే ముందు ఎక్కువగా ఇంట్లోనే ఉండి.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం సిద్ధమవుతోంది.