COVID in India: దేశంలో మెల్లిగా పెరుగుతున్న కరోనా కేసులు, గత 24 గంటల్లో 760 మందికి కరోనా, ఇద్దరు మృతి, 511కి పెరిగిన కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు
Representational image (Photo Credit- ANI)

New Delhi. Dec 4:  దేశంలో గత 24 గంటల వ్యవధిలో 760 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ (Health Ministry) శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,423కి చేరింది. నిన్న ఒక్కరోజే 775 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 4.44 కోట్లకు (4,44,78,047) చేరింది. నిన్న ఒక్కరోజే రెండు మరణాలు నమోదయ్యారు. దేశవ్యాప్తంగా కొవిడ్‌ మరణాల సంఖ్య 5,33,373కి ఎగబాకింది.

భారత్‌లో క్యాన్సర్‌తో 9.3 లక్షల మంది మృతి, అధిక కేసులు, మరణాల సంఖ్యలో ఆసియాలోనే రెండవ స్థానంలో ఇండియా

ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.01 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,79,081) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. భారత్‌లో కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు 511కి పెరిగాయి. మొత్తం 11 రాష్ట్రాల్లో ఈ కేసులు బయటపడ్డాయి.