ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. చైనాతో పాటు దక్షిణ కొరియా, జపాన్, థాయ్‌లాండ్, హాంకాంగ్, సింగపూర్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీపీసీఆర్ పరీక్ష తప్పనసరి చేసింది. ఇందుకు సంబంధించి మరోసారి నూతన ఆదేశాలు జారీ చేసింది.
విదేశీ ప్రయాణికులు ఎవరైనా ఈ ఆరు దేశాల మీదుగా ప్రయాణించి వేరే దేశం నుంచి వచ్చినా సరే ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్టు తప్పనిసరి అని పేర్కొంది. ఈ ప్రయాణికులు 72 గంటల ముందు తీసిన ఆర్టీపీసీఆర్ రిపోర్టును చూపిస్తేనే భారత్‌లో ప్రవేశానికి అనుమతి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఈ ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వారం రోజుల క్వారంటన్ నిబంధనను అమలు చేస్తోంది.