Coronavirus-in-India ( photo-PTI)

New Delhi, Sep 27: దేశంలో మరోసారి 30 వేల దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులు (Coronavirus in India) తగ్గుతుండటంతో.. క్రియాశీల కేసుల సంఖ్య కూడా 3 లక్షల దిగువకు పడిపోయింది. ఇక మృతుల సంఖ్య 300 లోపే (COVID 19 Deaths in India) నమోదైంది. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెలువరించిన ఈ గణాంకాలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. నిన్న 11,65,006 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 26,041 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. కేరళలో 15,951, మహారాష్ట్రలో 3,206 కేసులు వెలుగుచూశాయి. తాజాగా మరో 29 వేల మంది కోలుకున్నారు. దాంతో మొత్తం కేసులు 3.36 కోట్లకు చేరగా..రికవరీలు 3.29 కోట్లకు పెరిగాయి. రికవరీ రేటు 97.78 శాతంగా (Coronavirus Recovery Rate in India) ఉంది.

ప్రస్తుతం క్రియాశీల కేసులు మూడు లక్షల దిగువకు చేరాయి. ఈ కేసుల సంఖ్య 2.99 లక్షలు(0.89 శాతం)గా ఉంది. నిన్న 276 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దాంతో గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 4.47 లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు. 86 కోట్ల టీకా డోసులు.. దేశంలో కరోనా టీకా కార్యక్రమం వేగంగా సాగుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో పంపిణీ అయిన టీకా డోసుల సంఖ్య కాస్త తగ్గింది. నిన్న 38.18 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు 86 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

నిఫా వైరస్‌పై కోవిషీల్డ్ లాంటి టీకా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడి; తెలంగాణలో కొత్తగా 298 కోవిడ్ కేసులు నమోదు, గడిచిన ఒక్కరోజులో 325 మంది రికవరీ

మహారాషష్ట్రలో జైల్లోని ఖైదీలకు కరోనా సోకడంతో జైలును లాక్‌డౌన్ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో వెలుగు చూసింది. ఇక్కడి బైకుల్లా జైల్లో 39 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ అని తేలినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు జైలును లాక్‌డౌన్ చేశారు.ఇటీవల జైలుకు వచ్చిన ఖైదీల్లో ఎవరికైనా కరోనా సోకి ఉండొచ్చని, వారి వల్లే మిగతా వారికి ఈ వైరస్ సోకి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. కరోనా కలకలం కారణంగా అధికారులతోసహా ఖైదీలు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి జైల్లోని ఖైదీలను స్థానికంగా ఉన్న మున్సిపల్ స్కూల్లో క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. మజగావ్ ఏరియాలోని స్కూల్లో తాత్కాలిక క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జైల్లో ఖైదీలకు కరోనా సోకడంతో బైకుల్లా జైలును సీల్ చేస్తున్నట్లు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రకటించింది.