Coronavirus in India (Photo-PTI)

New Delhi, June 21: దేశ వ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు, మరణాల సంఖ్య తక్కువగా నమోదు (Lowest Tally Since March 24) అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 53,256 కొత్త కరోనా పాజిటివ్ కేసులు (COVID-19 in India) నమోదు అవగా... 1,422 మంది మృతి చెందారు. అలాగే కరోనా నుంచి కోలుకుని 78,190 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,35,221కి చేరింది. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 2,88,44,199గా నమోదు అయ్యింది. ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 7,02,887 ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,88,135కి చేరింది. ఇప్పటి వరకు టీకా తీసుకున్న వారి సంఖ్య 28,00,36,898గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించింది.

మహారాష్ట్రలో కొత్తగా 7 డెల్టా ప్లస్‌ కేసులను రత్నగిరి, నవీ ముంబై, పాల్ఘర్‌ జిల్లాల్లో ఆదివారం గుర్తించారు. రత్నగిరి జిల్లాలోనే 5 కేసులు వెలుగు చూశాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ వైద్య యంత్రాంగం ఈ జిల్లాల్లోని ప్రభావిత ప్రాంతాల నుంచి మరిన్ని శాంపిళ్లను సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపింది. వాటి తుది నివేదిక రావాల్సి ఉందని మహారాష్ట్రకు చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (డీఎంఈఆర్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ టి.పి.లహానే వెల్లడించారు. రత్నగిరి జిల్లాలో ఇన్ఫెక్షన్‌ బారినపడిన ఐదుగురిలో ఇద్దరికి కొవిడ్‌ లక్షణాలు బయటపడలేదన్నారు. కొల్హాపూర్‌, సతారా, సాంగ్లి, రాయ్‌గడ్‌, సింధుదుర్గ్‌ జిల్లాల్లోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో మూడోవేవ్‌ మొదలుకావచ్చని, ఇన్ఫెక్షన్ల వ్యాప్తిరేటు రెట్టింపయ్యే ముప్పు ఉందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ నివేదించింది.

కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షలు చెల్లించలేం, ఒక వేళ అలా చెల్లిస్తే విపత్తు సహాయ నిధులు మొత్తం వాటికే కేటాయించాల్సి వస్తుంది, సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

కాగా, రానున్న రోజుల్లో డెల్టా ప్లస్‌ ‘ఆందోళన రేకెత్తించే వేరియంట్‌’గా పరిణమిస్తుందని ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా హెచ్చరించారు. కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే, జాగ్రత్తలు తీసుకోకపోతే డెల్టా ప్లస్‌ వేరియంట్‌ ఆందోళనకరమైనదిగా పరిణమించే ప్రమాదం ఉందని ఎయిమ్స్‌ చీఫ్‌ హెచ్చరించారు. యూకేలో కేసులు మళ్లీ పెరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. యూకే నుంచి భారత్‌ పాఠాలు నేర్చుకోవాలన్నారు. ‘యూకే కఠినమైన లాక్‌డౌన్‌తో కరోనాను కట్టడి చేసింది. కొద్దికొద్దిగా ఆంక్షలు ఎత్తేస్తున్న క్రమంలో డెల్టా వేరియంట్‌ కారణంగా అక్కడ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలోనూ ఆంక్షలు సడలిస్తున్నారు.

మద్యం కొనుగోలులో 50 శాతం డిస్కౌంట్, రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నవారికి మాత్రమే..,హర్యానా గురుగ్రామ్‌‌లో బంపరాఫర్ పెట్టిన బార్, పబ్ యజమానులు

యూకేను చూసి పాఠాలు నేర్చుకోవాలి. 3-4 నెలలు జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు. కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే కొన్నివారాల్లో ఇండియాలోనూ కేసులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. దాన్ని తేలిగ్గా తీసుకోకుండా ఎదుర్కొనేందుకు సిద్ధం కావడం మంచిదని సూచించారు. నెలల తరబడి కఠిన లాక్‌డౌన్‌ తర్వాత బ్రిటన్‌ ప్రభుత్వం మార్కెట్లను తెరవగానే డెల్టా వేరియంట్‌ వల్ల ఒక్కసారిగా కేసులు భారీగా పెరగడాన్ని గుర్తుంచుకోవాలన్నారు. భారత్‌ ఇప్పుడు అప్రమత్తతతో వ్యవహరించకుంటే 3, 4 నెలల తర్వాత బ్రిటన్‌ పరిస్థితి రావచ్చని పేర్కొన్నారు.