COVID Outbreak - Representational Image (Photo-PTI)

New Delhi, June 1: దేశంలో రెండో విడత కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. రోజురోజుకు కేసులు, మరణాల సంఖ్య తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 1,27,510 కరోనా పాజిటివ్ కేసులు (Coronavirus in India) నమోదు కాగా, 2,795 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం కరోనా బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,55,287 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జయ్యారు.

తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల (COVID-19 Cases in India) సంఖ్య 2,81,75,044. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 18,95,520. కరోనాకు చికిత్స పొంది ఇప్పటివరకు డిశ్చార్జయిన వారి మొత్తం సంఖ్య 2,59,47,629. దేశంలో మొత్తం కరోనా మృతులు 3,31,895. దేశంలో 91.60 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉండడం గమనార్హం. దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 7.22 శాతం. మొత్తం కేసులలో మరణాల రేటు 71.16 శాతంగా ఉంది.

జూన్​ 8 వరకు లాక్​‌డౌన్‌ను​ పొడిగించిన బీహార్, అత్యవసర షాపులకు మాత్రమే మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి, కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నితీష్​ కుమార్​

దేశంలో ఇప్పటి వరకు 21.58 కోట్ల వ్యాక్సిన్‌ మోతాదులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఒకే రోజు 18-44 ఏళ్లలోపు సంవత్సరాలున్న వారు 12,23,596 మంది మొదటి మోతాదు, 13,402 మంది రెండో మోతాదు అందుకున్నారని పేర్కొంది. మూడో దశ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ప్రారంభమైన నాటి నుంచి దేశవ్యాప్తంగా 2,02,10,889 మందికి వారి మొదటి, 23,491 మందికి రెండో మోతాదు వేసినట్లు పేర్కొంది. బిహార్‌, ఢిల్లీ, గుజరాత్‌, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లో పది లక్షలకుపైగా లబ్ధిదారులకు మొదటి మోతాదు అందిందని చెప్పింది.

పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్ న్యూస్, మీ పీఎఫ్ ఖాతాను వెంటనే ఆధార్‌తో లింక్ చేయండి, చేయకుంటే యజమాని వాటా ఇక పొందలేరు, జూన్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్, ఈపీఎఫ్‌ను ఆధార్‌తో లింకు చేయండి ఇలా..

దేశంలో నిర్వహిస్తున్న వ్యాక్సిన్‌ డ్రైవ్‌ సోమవారం రాత్రి అందిన వివరాల మేరకు 21,58,18,547 డోసులు వేసినట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది. టీకా డ్రైవ్‌ సోమవారం నాటికి 136వ రోజుకు చేరుకోగా.. ఒకే రోజు 25,52,501 వ్యాక్సిన్ మోతాదులను ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందులో 22,75,324 మంది లబ్ధిదారులకు మొదటి మోతాదు.. మరో 2,77,177 మందికి సెకండ్‌ డోస్‌ వేసినట్లు వివరించింది.