Coronavirus in India: బోస్టర్ డోస్‌పై ఇంకా వీడని సందేహాలు, దేశంలో తాజాగా 18,132 మందికి కోవిడ్, 85 మంది మృతి, మరికొన్ని నెలలపాటు బూస్టర్‌ డోసుకు దూరంగా ఉండాలని తెలిపిన డబ్ల్యూహెచ్‌వో
Coronavirus outbreak | (Photo Credits: IANS)

New Delhi, Oct 11: దేశంలో కొత్త‌గా 18,132 కరోనా కేసులు (India Reports 18,132 New COVID-19 Cases) న‌మోద‌య్యాయి. అలాగే, నిన్న‌ 21,563 మంది క‌రోనా (Coronavirus in India) నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,32,93,478కి చేరింది. నిన్న‌ 193 మంది క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,50,782కి చేరింది. ప్ర‌స్తుతం 2,27,347 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స పొందుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 95,19,84,373 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. కేర‌ళ‌లో నిన్న ఒక్క‌రోజులో 10,691 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 85 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.

కరోనావైరస్ (Coronavirus) సమూల కట్టడికి మూడో డోసు (బూస్టర్‌ డోసు) ఇవ్వాలన్న అభిప్రాయం దేశంలో క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లోని ప్రముఖ వైద్యులందరూ బూస్టర్‌ డోసు వేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దేశంలో బూస్టర్‌ డోసు ఇవ్వడంపై అధికారికంగా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు రెండు డోసుల టీకా తీసుకున్నప్పటికీ, తరుచూ వైరస్‌ బారిన పడుతున్నారు. దీంతో వారిలో యాంటిబాడీల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. ఈ క్రమంలోనే ప్రధాన నగరాల్లోని కొందరు వైద్యులు ‘బూస్టర్‌ డోసు’ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

ఎయిర్ ఇండియా టాటా చేతిలో ఎలా ఉండబోతోంది, నష్టాల నుంచి గట్టెక్కి లాభాల వైపు పయనిస్తుందా..

ఇదిలా ఉంటే పేద దేశాలు వ్యాక్సిన్‌ కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ధనిక దేశాలు మరికొన్ని నెలలపాటు బూస్టర్‌ డోసుకు దూరంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్‌, ఐరోపా వంటి దేశాలు బూస్టర్‌ డోసు పంపిణీని ఇప్పటికే మొదలు పెట్టాయి. దేశంలో ఇప్పటివరకూ 95 కోట్ల డోసులను పంపిణీ చేసినట్టు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. అయితే ఇంకా 70 శాతం మంది ప్రజలకు పూర్తిస్థాయి వ్యాక్సినేషన్‌ (రెండు డోసుల టీకాలు) జరుగలేదని స్వచ్ఛంద నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలకు ఇప్పటికిప్పుడు బూస్టర్‌ డోసు ఇవ్వడం జరుగకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.