Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

New Delhi, Sep 7: దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 31,222 పాజిటివ్ కేసులు (Coronavirus in India) న‌మోదు కాగా, 290 మంది (290 deaths in the last 24 hours ) చ‌నిపోయారు. నిన్న క‌రోనా నుంచి కోలుకుని 42,942 మంది డిశ్చార్జి అయ్యారు. ప్ర‌స్తుతం 3,92,864 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 3,30,58,843కు చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు 3,22,24,937 మంది కోలుకున్నారు. మ‌ర‌ణాల సంఖ్య 4,41,042కు చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు 69,90,62,776 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. నిన్న ఒక్క‌రోజే కేర‌ళ‌లో 19,688 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 135 మంది మ‌ర‌ణించారు.

మనదేశంలో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో 1.25 కోట్ల కోవిడ్ డోసులు వేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రతిరోజూ వేసే ఈ కోవిడ్ డోసులు సంఖ్య అనేక దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువగా అని నొక్కి చెప్పారు. అర్హులైన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసును అర్హులైన అందరికీ అందించిన రాష్టంగా నిలిచిన హిమచల్‌ప్రదేశ్‌ ప్రజలతో వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్న మోదీ.. దేశంలో ఇప్పటివరకు 70 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేసినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో "దవాయ్ భీ, కరాయ్ భీ(టీకాలు వేయండి, కోవిడ్ ప్రోటోకాల్స్ ఖచ్చితంగా పాటించండి)" అనే మంత్రాన్ని మనం మరచిపోకూడదని మోదీ అన్నారు.

సెప్టెంబ‌ర్ 27న భారత్ బంద్, రైతు సంఘాల పిలుపుకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతు సంఘాల నేతలు

లాజిస్టిక్ ఇబ్బందులు ఉన్నప్పటికీ అర్హులైన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ మొదటి మోతాదును ఇచ్చిన మొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ "ఛాంపియన్"గా మారిందని అన్నారు. అలాగే, ఆ రాష్ట్రంలో 30 శాతం మంది సెకండ్ డోసు వేసుకున్నట్లు మోడీ అన్నారు. సీక్కిం, దాద్రా, నాగర్ హావేలీ కూడా ఈ లక్ష్యాన్ని సాధించాయని, అనేక ఇతర రాష్ట్రాలు దీనిని సమీపిస్తున్నాయని మోదీ చెప్పారు.