Coronavirus in US (Photo Credits: PTI)

New Delhi, July 18: దేశంలో రెండు రోజుల పాటు 40 వేలకు దిగువన నమోదైన కేసులు.. తాజాగా 41 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 41,157 పాజిటివ్‌ కేసులు (India Reports 41,157 Fresh COVID-19 Cases) కొత్తగా నమోదయ్యాయి. మరో 42,004 మంది కోలుకోగా, 518 మంది మృతి (518 Deaths in Past 24 Hours) చెందారు. మొత్తం కేసుల్లో 4,22,660 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,02,69,796 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,13,609 మంది మహమ్మారివల్ల మృతిచెందారు.

కాగా, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ (Covid Vaccination) ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 40,49,31,715 కరోనా డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా పాజిటివిటీ రేటు 2.13 శాతంగా ఉండగా, రికవరీ రేటు 97.31 శాతంగా ఉందని తెలిపింది. అయితే గత 21 రోజులుగా పాజిటివ్‌ కేసులు 50 వేల కంటే తక్కువగా ఉంటున్నాయి. కాగా, శనివారం నాటికంటే ఆదివారం నమోదైన కేసుల సంఖ్య 7.4 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

భారత్‌ వ్యాక్సినేషన్‌లో మరో కీలక మైలురాయిని దాటింది. శనివారం ఇచ్చిన 46.38 లక్షల డోసులతో కలిపి దేశంలో టీకాల పంపిణీ 40 కోట్ల మైలురాయిని దాటింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారం 21,18,682 మంది తొలిడోసు స్వీకరించగా.. 2,33,019 మంది రెండో డోసు తీసుకొన్నారు. దీంతో 40.49 కోట్ల డోసుల టీకాలు ఇచ్చినట్లైంది. ఇక కొవిడ్‌ సోకిన వ్యక్తికి క్షయ (టీబీ) సోకే అవకాశలు పెరిగిపోతాయని అధికారులు వెల్లడించారు. కాకపోతే, క్షయ సోకిన కేసులు తక్కువగానే ఉన్నాయని చెప్పారు. 2020 నుంచి కొవిడ్‌ నిబంధనల అమల్లో ఉండటంతో దేశంలో టీబీ కూడా తగ్గుముఖం పట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

కరోనా పేషెంట్లు వెంటనే టీబీ టెస్ట్ చేయించుకోండి, అలాగే టీబీ రోగులంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపిన హెల్త్ మినిస్ట్రీ, టిబి కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్నాయంటూ వచ్చిన నివేదికలపై స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ

కోవిడ్‌ వల్ల వ్యక్తులు క్షయవ్యాధికి గురయ్యే అవకాశం ఉందని, బ్లాక్‌ ఫంగస్‌ వంటి అవకాశవాద సంక్రమణ అని, అయితే ప్రస్తుతం వైరల్‌ వ్యాధి కారణంగా టీబీ కేసులు పెరిగాయని సూచించడానికి తగిన ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. కోవిడ్‌ సంబంధిత ఆంక్షల కారణంగా క్షయవ్యాధి కేసుల సంఖ్య 2020లో సుమారు 25%తగ్గిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల కోవిడ్‌ బారిన పడిన రోగులలో టీబీ కేసులు అకస్మాత్తుగా పెరిగాయంటూ కొన్ని వార్తా నివేదికలు వచ్చాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రతిరోజూ డజనుకు పైగా ఇలాంటి కేసులకు చికిత్స అందిస్తున్న వైద్యులలో ఇది ఆందోళన రేకెత్తించిందని తెలిపింది.

వ్యాక్సిన్ వేసుకున్నా ముంచుకొస్తున్న థర్డ్ వేవ్ ముప్పు, రానున్న 100 రోజులే కరోనాకు అత్యంత కీలకం, హెచ్చరించిన కేంద్ర ఆరోగ్యశాఖ, 

కోవిడ్‌ పేషెంట్లకు క్షయ రోగ నిర్ధారణ పరీక్షలు, అలాగే టీబీ వ్యాధిగ్రస్తులకు కోవిడ్‌ పరీక్షలు సిఫారసు చేసినట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. సార్స్‌ కోవ్‌ 2 వైరస్‌ సంక్రమణతో ఒక వ్యక్తి క్రియాశీల టీబీ వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది ‘ఇది బ్లాక్‌ ఫంగస్‌ వంటి అవకాశవాద సంక్రమణ‘అని పేర్కొంది. కోవిడ్‌ కారణంగా టీబీ కేసులు పెరిగాయని సూచించడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవని తెలిపింది. టీబీ కేసులు, కోవిడ్‌ కేసులు రెండింటినీ కనుగొనే ప్రయత్నాలు చేపట్టాలని రాష్ట్రాలను కోరింది.

‘కోవిడ్‌ సంబంధిత ఆంక్షల ప్రభావం కారణంగా, 2020లో టీబీ కేస్‌ నోటిఫికేషన్లు 25 శాతం తగ్గాయి. అయితే ఈ ప్రభావాన్ని తగ్గించడానికి ఓపీడీ సెట్టింగుల ద్వారా, కేస్‌ నిర్ధారణ క్యాంపెయిన్‌ ద్వారా ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి’అని వివరించింది.