COVID in India: దేశంలో థర్డ్ వేవ్ కలవరం, ఆందోళన కలిగిస్తున్న డెల్టా ప్లస్‌, కప్పా, లాంబ్డా వేరియంట్లు, భారత్‌లో తాజాగా 42,766 కరోనా కేసులు నమోదు, కొత్తగా 1,206 మంది మృతి, క‌ప్పా వేరియంట్‌తో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న నిపుణులు
Coronavirus Outbreak (Photo credits: IANS)

New Delhi, July 10: దేశంలో కొత్తగా 42,766 కరోనా కేసులు నమోదు అవగా... 1,206 మంది మృతి (Coronavirus deaths in india) చెందారు. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,95,716కి చేరింది. అలాగే మొత్తం 4,07,145 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,55,033 యాక్టివ్ కేసులు (Corona Active Cases) ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 92.20 శాతానికి పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 37.21 కోట్ల మందికి టీకా పంపిణీ జరిగింది.

కేరళలో గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 13,563 కరోనా కేసులు, 130 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 30,39,029కు, మొత్తం మరణాల సంఖ్య 14,380కు పెరిగింది. కాగా గత 24 గంటల్లో 10,454 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ ‌అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 29,11,054కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,13,115 యాక్టివ్ ‌కరోనా కేసులు ఉన్నట్లు వెల్లడించింది.

దేశంలో ఇంకో కొత్త వైరస్, కేరళని వణికిస్తున్న జికా వైరస్, రెండు రోజుల్లోనే 14 కేసులు వెలుగులోకి, జికా వైరస్‌ లక్షణాలు ఏంటి, శరీరంలో జికా వేటిపై ప్రభావం చూపుతుంది, Zika Virus ఎలా వ్యాపిస్తుంది, పూర్తి సమాచారం మీకోసం

ఈశాన్య భారతంలోని త్రిపురలో మొదటిసారిగా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ (Delta Plus Variant) కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 90 డెల్టా ప్లస్‌ కేసులను గుర్తించామని అధికారులు ప్రకటించారు. ఈ తరహా లక్షణాలు కనిపించిన 151 మంది నుంచి నమూనాలను సేకరించామని, పరీక్షల నిమిత్తం వాటిని పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ ల్యాబ్కు పంపించామని తెలిపారు. వాటిలో 90 మందికి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ పాజిటివ్‌ వచ్చిందని వెల్లడించారు. మరికొన్ని నమూనాల్లో డెల్టా, ఆల్ఫా వేరియంట్‌ లక్షణాలు బయటపడ్డాయని చెప్పారు.

ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులపాటు కర్ఫ్యూ విధించింది. ఇది శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సోమవారం 6 గంటల వరకు ఇది అమల్లో ఉంటుందని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలు, రాజధాని అగర్తలా మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కర్ఫ్యూ అమల్లో ఉన్నది.

థర్డ్ వేవ్ భయం..కరోనా సోకిన పిల్లల్లో కొత్తగా MIS-C వ్యాధి, దావణగెరెలో మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్‌తో 5 ఏళ్ల బాలిక మృతి, కర్ణాటక రాష్ట్రంలో తొలి మరణం కేసు నమోదు

యూపీలో రెండు కప్పా వేరియంట్‌ (Kappa Variant) కేసులు వెలుగుచూశాయి. కింగ్‌జార్జ్‌ మెడికల్‌ కళాశాలలో 109 కేసులను పరీక్షించగా, వాటిల్లో 107 కేసులు డెల్టా ప్లస్‌ కాగా.. రెండు కప్పా కేసులు ఉన్నాయి. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, సరైన చికిత్స అందిస్తే రోగులు కోలుకోవచ్చని అధికారులు చెప్పారు. మరోవైపు, దేశంలో ఇప్పటి వరకు లాంబ్డా వేరియంట్‌ కేసు ఒక్కటి కూడా వెలుగుచూడలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.

కరోనా వైర‌స్ సెకండ్ వేవ్ త‌గ్గుముఖం ప‌ట్టినా ప‌లు నూత‌న వేరియంట్లు వెలుగుచూడ‌టం ఆందోళ‌న రేకెత్తిస్తోంది. క‌ప్పా, లాంబ్డా వేరియంట్ల‌ను దృష్టిసారించాల్సిన స్ట్రెయిన్లుగా గుర్తించిన‌ట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మార్చి నుంచే డెల్టా త‌ర‌హాలోనే క‌ప్పా వేరియంట్ ఆన‌వాళ్లు భార‌త్‌లో క‌నిపించాయ‌ని నీతిఆయోగ్ స‌భ్యులు డాక్ట‌ర్ వీకే పాల్ పేర్కొన్నారు. దీని శాస్త్రీయ ప్ర‌భావం, క‌ప్పా వేరియంట్‌పై వ్యాక్సిన్ సామ‌ర్ధ్యంపై మ‌నం దృష్టిసారించాల్సి ఉంద‌ని ఆయ‌న చెప్పారు. క‌ప్పా వేరియంట్‌ను వైద్య నిపుణులు ప‌రిశీలిస్తున్నార‌ని తెలిపారు.

కరోనా కన్నా ప్రమాదకర వైరస్, మహారాష్ట్రలో మహాబలేశ్వర్ గుహలో గబ్బిలాల్లో నిఫా వైరస్, మనుషులకు సోకితే భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం వైద్య నిపుణుల హెచ్చరిక, నిఫా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి

మరోవైపు దేశంలో గత వారం నమోదైన కరోనా కేసుల్లో 53 శాతం కేరళ (32 శాతం), మహారాష్ట్ర (21 శాతం) నుంచేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల్లో కంటైన్‌మెంట్‌ చర్యలను పాటించాలని పేర్కొంది. కరోనా మహమ్మారి అంతమవుతోందన్న భావనలో ఉండవద్దని ప్రజలకు సూచించింది. పర్యాటక ప్రాంతాల్లో పెరుగుతున్న జన రద్దీ, ప్రజలు కరోనా నిబంధనలను పాటించకపోవడం చాలా ఆందోళన కలిగిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల కరోనా వ్యాప్తి మరింతగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.