New Delhi, November 22: దేశంలో తాజాగా 45,209 పాజటివ్ కేసులు (Covid in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90,95,807 కు (COVID-19 Cases in India) చేరింది. కరోనాకు చికిత్స పొందుత్నువారిలో కొత్తగా 501 మంది ప్రాణాలు కోల్పోడంతో మొత్తం మరణాల సంఖ్య 1,33,227కు (Covid Deaths) చేరింది. వైరస్ బాధితుల్లో తాజాగా 43,493 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 85,21,617 కు చేరింది.
4,40,962 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా కోవిడ్ బాధితుల రికవరీ రేటు 93.69 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో 4.85 శాతం యాక్టివ్ కేసులున్నాయని, మరణాల రేటు 1.46 శాతంగా ఉందని బులెటిన్‌లో వెల్లడించింది.
అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తరుణ్ గొగోయ్ (Tarun Gogoi) ఆరోగ్యం విషమించింది. కరోనా అనంతర సమస్యలతో ఆయన గువాహటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఈనెల 2 నుంచి చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్‌పై గొగోయ్‌కి చికిత్స అందిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత బిస్వ శర్మ శనివారం వెల్లడించారు. శ్వాస తీసుకోవడంలో ఆయన తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, కీలక అవయవ వ్యవస్థలు వైఫల్యం చెందాయని తెలిపారు. ఆగస్ట్ 25న∙గొగోయ్‌కి కోవిడ్‌గా నిర్ధారణ అయింది.
రెండో దఫా లాక్‌డౌన్
ఇదిలా ఉంటే కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో (Corona Second Wave) కూడా విశ్వరూపం చూపుతోంది. దీంతో యూరోపియన్ దేశాలు కొన్నింటిలో రెండో దఫా లాక్‌డౌన్ (2nd Lockdown) విధించారు. ఇండియాలో కూడా కేసులు పెరుగుతుండటంతో రెండవ దశ లాక్‌డౌన్ (Lockdown 2) విధించాలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశాలు కనపడటం లేదు.
లాక్‌డౌన్ విధించడం కంటే మాస్కులు ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి చర్యలను అమలు చేయడం ద్వారా వ్యాధి ప్రబలకుండా అడ్డుకోవచ్చునని సూచిస్తున్నారు. మధ్యప్రాచ్య దేశాల్లో సెకెండ్ వేవ్ మొదలు కానుందని నవంబర్ 19న హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆయా ప్రభుత్వాలు నియంత్రణకు కచ్చితంగా వ్యక్తిగత, సామాజిక రక్షణ చర్యల అమలుపై దృష్టి పెట్టడం మేలని సూచించింది.
పలు రాష్ట్రాల్లో కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధనలు...
ఢిల్లీ: 8 మాస్కు వేసుకోకపోయినా, కోవిడ్–19 నిబంధనలు అతిక్రమించినా రూ.5,000 వరకు జరిమానా 8 పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు 50 మందికే అనుమతి. కొన్ని మార్కెట్లపై కఠినమైన నిఘా.. పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఉండదని సీఎం కేజ్రీవాల్ స్పష్టీకరణ
హరియాణా : నవంబర్ 30వ తేదీ వరకు పాఠశాలలు బంద్. మార్చిలో విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. ఇటీవలే వీటిని పునఃప్రారంభించడంతో 174 మంది విద్యార్థులు, 107 మంది ఉపాధ్యాయులు కోవిడ్ బారిన పడ్డారు. దీంతో స్కూళ్లను మరోసారి తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది.
ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని పాఠశాలలూ ఈ ఏడాది మొత్తం తెరుచుకోవు. ఈ అంశంపై నిర్ణయాన్ని స్థానిక సంస్థలకు వదిలేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. పాఠశాలల విషయంలో థానే కూడా ముంబై మార్గాన్నే ఎంచుకుంది.
అహ్మదాబాద్: 8 శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు పూర్తిస్థాయి కర్ఫ్యూ. పాలు, మందులమ్మే దుకాణాలకు మాత్రమే అనుమతి.
8 ప్రతిరోజూ రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ కర్ఫ్యూ. 8 పాఠశాలలు, కాలేజీలు ముందుగా నిర్ణయించినట్లు నవంబర్ 23న ప్రారంభం కాకుండా తాజా ఆదేశాలు 8 గుజరాత్‌లోని రాజ్‌కోట్, సూరత్, వడోదరల్లో నవంబర్ 21 నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధింపు
ఇండోర్: నవంబర్ 21 నుంచి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ. అత్యవసర సేవల్లో ఉన్నవారు, ఫ్యాక్టరీ కార్మికులకు మాత్రమే మినహాయింపు. 8 మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇండోర్, గ్వాలియర్, విదిశ, రత్లాంలలోనూ రాత్రిపూట కర్ఫ్యూ. 8 పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఉండదని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టీకరణ.
రాజస్తాన్: నవంబర్ 21 నుంచి రాజస్తాన్‌లోని అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ విధింపు.