Coronavirus in US (Photo Credits: PTI)

New Delhi, November 21: భారత్‌లో గత 24 గంటల్లో 46,232 కొత్త కరోనా కేసులు (COVID-19 in India) బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90 లక్షల 50వేలు దాటింది. అదే సమయంలో కరోనా కారణంగా 564 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,32,726కు చేరుకుందని వైద్యారోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య శనివారానికి 84.78,124కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 93.67 శాతానికి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,39,747గా (Coronavirus Cases in India) ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్‌ కేసులు 4.86 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.47గా ఉంది.

బ్రిహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) పరిధిలోని పాఠశాలలన్నీ డిసెంబర్‌ 31 వరకు మూసే ఉంచాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం బీఎంసీ కమిషనర్‌ ఇక్బాల్‌ చహల్‌ ఉత్తర్వులు జారీచేశారు. ముంబైలో మళ్లీ కరోనా కేసులు సంఖ్య పెరుగుతుండటంతోపాటు మరికొన్ని కారణాల వల్ల బీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. ముంబై పరిధిలోని పాఠశాలల ప్రారంభానికి మరికొంత సమయం పడుతుందని ఉత్తర్వులో కమిషనర్‌ పేర్కొన్నారు.

 ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది, క్రిస్మస్ కంటే ముందే ఫైజ‌ర్ కోవిడ్ వ్యాక్సిన్‌ని తీసుకువస్తామని తెలిపిన బయోఎన్‌టెక్ సీఈవ్ ఉగుర్ సాహిన్

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్‌ నవంబర్‌ 23వ తేదీన 9వ తరగతి నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు తెరిచేందుకు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు, సిబ్బందికి కరోనా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించడం ప్రారంభించారు.అయితే ఈ నిర్ణయంపై కరోనా రెండో దశ ప్రభావం పడింది. దీపావళి పండుగ అనంతరం మరోసారి కరోనా కేసులు ముంబైతోపాటు రాష్ట్రంలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు కరోనా సోకకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా బీఎంసీ పాఠశాలల ప్రారంభంపై వెనకడుగు వేసింది. ముంబై మేయర్‌ కిషోరి పేడ్నేకర్‌ మాట్లాడుతూ.. ముంబైలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని దీంతో నవంబర్‌ 23వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంలేదని పేర్కొన్నారు.

ఏడు ఏళ్ల క్రితమే కేరళలో కరోనా, తన దుకాణానికి కరోనా అనిపేరు పెట్టుకున్న కొట్టాయమ్ వ్యాపారవేత్త, జ్యూయెలరీ షాపులో 31 మందికి క‌రోనావైరస్

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేదని ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. అయితే కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా పాఠశాలలు, కళాశాలల మూసివేత కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై శుక్రవారం సీఎం అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం భోపాల్‌లో జరిగింది. కరోనా మహమ్మారి వ్యాపించకుండా పకడ్భందీ చర్యలు తీసుకోడం కోసం జిల్లాల అధికారులు విపత్తు నిర్వహణ శాఖ వారితో సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ ఆదేశించారు.